బొత్సలా పారిపోలేదు, దొంగల్ని జైలుకు పంపిద్దాం: జగన్‌పై అశోక్ తీవ్రవ్యాఖ్యలు

Posted By:
Subscribe to Oneindia Telugu

విజయనగరం: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ నేత, కేంద్రమంత్రి అశోక్ గజపతి రాజు ఆదివారం నిప్పులు చెరిగారు.

డేరాబాబా కంటే దేశద్రోహి: టిజి, కవిత, అధినేతలకు షాక్.. కంచ ఐలయ్యపై ఒక్కటైన టిడిపి-వైసిపి!

జైలుకు వెళ్లొచ్చి నీతులా

జైలుకు వెళ్లొచ్చి నీతులా

అవినీతికి పాల్పడి జైలుకు వెళ్లి బెయిల్ పైన వచ్చిన నాయకుడు నేడు నీతిపరుడిలా మాట్లాడటం విడ్డూరంగా, విచారకరంగా ఉందని జగన్‌ను ఉద్దేశించి అశోక్ అన్నారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమేనని చెప్పారు.

బొత్సలా పారిపోలేదు!

బొత్సలా పారిపోలేదు!

తాను ఎమ్మెల్యేగా ఓడిపోయినా విజయనగరంలో ఇంట్లోనే ఉన్నానని అశోక్ చెప్పారు. కానీ వైసిపి నేత బొత్స సత్యనారాయణలా జిల్లాను విడిచి వెళ్లిపోలేదని ఎద్దేవా చేశారు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా బొత్స సత్యనారాయణ ఉన్నప్పుడే రాష్ట్ర విభజన జరిగిందని గుర్తు చేశారు.

బొత్స అధ్యక్షుడిగా ఉన్నప్పుడే అన్యాయం

బొత్స అధ్యక్షుడిగా ఉన్నప్పుడే అన్యాయం

బొత్స సత్యనారాయణ అధ్యక్షుడిగా ఉన్నప్పుడే తెలుగు ప్రజలకు అన్యాయం జరిగిందని అశోక్ ఆరోపించారు. బొత్స అండ్ కో జిల్లాను మద్యం జిల్లాగా మార్చేసిందని మండిపడ్డారు. కర్ఫ్యూను పెట్టి ప్రజలను ఇబ్బందులగు గురి చేశారన్నారు.

రండి కలిసి పని చేద్దాం

రండి కలిసి పని చేద్దాం

రండి కలిసి పని చేద్దాం.. దొంగలను జైలుకు పంపిద్దాం.. దేశంలో అవినీతిని పారద్రోలుదాం అని అశోక్ గజపతి రాజు ప్రజలకు పిలుపునిచ్చారు. ఆయన ఆదివారం గొల్లలపేటలో ఇంటింటికి టిడిపి కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Union Minister and Telugu Desam Party leader Ashok Gajapathi Raju hot comments on YSR Congress Party chief YS Jaganmohan Reddy and YSR Congress party leader Botsa Satyanarayana.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి