పక్క రాష్ట్రాలతోనే..: ప్రత్యేక హోదాపై అశోక్ గుర్రు

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని సమీపంలోని గన్నవరం విమానాశ్రయం విస్తరణకు కేంద్రం సిద్ధంగా ఉందని కేంద్ర పౌర విమానయాన శాఖమంత్రి అశోక్ గజపతిరాజు తెలిపారు. ఆయన గురువారం గన్నవరం విమానాశ్రయాన్ని సందర్శించారు.

ఈ సందర్భంగా అశోక్ గజపతిరాజు మాట్లాడుతూ శంషాబాద్ విమానాశ్రయం లాగానే గన్నవరం విమానాశ్రయాన్ని కూడా అభివృద్ధి చేస్తామన్నారు. విమానాశ్రయం విస్తరణ కోసం భూమిని సేకరించే పని రాష్ట్ర ప్రభుత్వంపైనే ఉందన్నారు. గన్నవరం ఎయిర్ పోర్టులో సౌకర్యాలు అంతగా లేవని ఆయన అన్నారు.

Ashok gajapathi raju review meeting at gannavaram airport

గన్నవరం విమానాశ్రయం కంటే విజయవాడ బస్టాండే బాగుందని మంత్రి అశోక్ గజపతిరాజు వ్యాఖ్యానించారు. ఇక ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై స్పందిస్తూ దేశంలో ఉన్న ఇతర రాష్ట్రాలైన తెలంగాణ, తమిళనాడు, జార్ఖండా వల్లే ఏపీకి ప్రత్యేక హోదా రావడం లేదన్నారు.

అనంతరం విజయవాడలోని బుడమేర వంతెనను ప్రారంభించిన ఆ వంతెనకు అల్లూరి సీతారామరాజు పేరుని పెట్టారు. అంతకముందు కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు ...గన్నవరం, రాజమండ్రి విమానాశ్రయాల విస్తరణపై సదరు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+