ఏ సూత్రమో: జగన్‌పై అశోక్ గజపతి రాజు తీవ్రవ్యాఖ్యలు, ఆ మాటతో బాబుకూ ఝలకే

Posted By:
Subscribe to Oneindia Telugu

విజయనగరం: రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిన కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అన్యాయం చేసిందని కేంద్రమంత్రి, తెలుగుదేశం పార్టీ నేత అశోక్ గజపతి రాజు సోమవారం అన్నారు. రూ.16 వేల కోట్ల లోటు బడ్జెట్‌తో పరిపాలన ప్రారంభించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు.

లేదంటే వెళ్లిపోండి: చుక్కలు చూపించారు, రిపోర్టర్లపై మహేష్ కత్తి తీవ్ర ఆగ్రహం

కేంద్రం సహకారంతో సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తున్నారని చెప్పారు. రైతులకు రుణమాఫీ చేసిన ఘనత చంద్రబాబుదే అన్నారు. ప్రతిపక్ష నాయకుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో 43వేల కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేశారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

 ఇంకా లూటీకి జగన్ ప్రయత్నాలు

ఇంకా లూటీకి జగన్ ప్రయత్నాలు

తన తండ్రి హయాంలో లూటీ చేసిన ధనం చాలదు అన్నట్లుగా మరింత దోచుకోవడానికి జగన్ ప్రయత్నాలు చేస్తున్నారని, అందుకే ముఖ్యమంత్రి కావాలని అనుకుంటున్నారని అశోక్ గజపతి రాజు అన్నారు. ఎన్నికల్లో అవినీతిపరులను గెలిపించవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.

సభకు వెళ్లరు కానీ, సీఎంను అవుతానని మాట్లాడుతారు

సభకు వెళ్లరు కానీ, సీఎంను అవుతానని మాట్లాడుతారు

ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపిస్తే వారు శాసనసభకు వెళ్లరని, ప్రజల కోసం పని చేయరని, కానీ ముఖ్యమంత్రిని అవుతానంటూ మాట్లాడుతారని జగన్‌ను, వైసీపీని ఉద్దేశించి అశోక్ గజపతి రాజు అన్నారు. ఇటీవల అసెంబ్లీ సమావేశాలను వైసీపీ బహిష్కరించిన విషయం తెలిసిందే.

  అశోక్ గజపతి రాజుకు అవమానం !
  ముప్పై ఏళ్లు సీఎం ఏ ప్రజాస్వామ్య సూత్రమో

  ముప్పై ఏళ్లు సీఎం ఏ ప్రజాస్వామ్య సూత్రమో

  సభకు వెళ్లరు కానీ ముప్పై ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉంటానని చెబుతుంటారని, అలా చెప్పడం ఏ ప్రజాస్వామ్య సూత్రమో అర్థం కావడం లేదని అశోక్ గజపతి రాజు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రాష్ట్రంలో టీడీపీ, కేంద్రంలో ఎన్డీఏ అధికారంలోకి రాకుంటే పోలవరం ప్రాజెక్టు పనులు జరిగేవా? అని ప్రశ్నించారు.

  ఆ పెద్ద మనిషి చెప్పగలరా?

  ఆ పెద్ద మనిషి చెప్పగలరా?

  విజయనగరం జిల్లా గరివిడి మండలం వెదుళ్లవలసలో సోమవారం జన్మభూమి- మాఊరు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర విభజన సమయంలో చరిత్ర ఏమైనా మనకు అన్నం పెడుతుందా? అని జిల్లాకు చెందిన ఓ పెద్ద మనిషి అన్నారు. విభజనతో ఆంధ్రప్రదేశ్‌కు ఏవిధంగా న్యాయం చేశారో ఆయన చెప్పగలరా? అని అశోక్‌ ప్రశ్నించారు.

   తెలియకుండా చంద్రబాబుకూ ఝలక్

  తెలియకుండా చంద్రబాబుకూ ఝలక్

  ఇదిలా ఉండగా, ఇరవై ముప్పై ఏళ్ల పాటు అధికారం మనదే అనడం ఏ ప్రజాస్వామ్య సూత్రమోనని అశోక్ గజపతి రాజు చేసిన వ్యాఖ్యలు జగన్‌‌తో పాటు చంద్రబాబు, టీడీపీలకు కూడా తగులుతాయని అంటున్నారు. ఎందుకంటే చంద్రబాబు, టీడీపీ నేతలు కూడా అదే చెబుతున్నారు. చంద్రబాబే సీఎంగా ఉంటారని టీడీపీ నేతలు, టీడీపీయే అధికారంలో ఉంటుందని చంద్రబాబు చెబుతున్న విషయం తెలిసిందే.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Union Minister and Telugu Desam Party leader Ashok Gajapathi Raju slams YS Jagan indirectly.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి