ఇప్పుడంటే ఇప్పుడు.. ఏదో ఒకరోజు పేల్చాల్సిందే: ఎంపీలకు అశోక్ గజపతిరాజు షాక్

Recommended Video

    No special status to AP : 2 Ministers may Quit Modi Cabinet

    అమరావతి: టీడీపీ-బీజేపీ బంధం ఇక క్లైమాక్స్ కు చేరినట్టే కనిపిస్తోంది. నేడో.. రేపో.. చంద్రబాబు ఆ విషయంపై కుండబద్దలు కొట్టేస్తారని చెబుతున్నారు. మంగళవారం నాటి టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో దీనికి బీజం పడ్డట్టు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.

    మెజారిటీ ఎమ్మెల్యేలంతా తెగదెంపులకే సై అనడంతో.. చంద్రబాబు కూడా ఆ దిశగా సన్నద్దమవుతున్నారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తాజాగా మరో ఆసక్తికర కథనం తెర పైకి వచ్చింది.

    పార్లమెంటరీ సమావేశంలో:

    పార్లమెంటరీ సమావేశంలో:

    తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశంలో రాజమండ్రి ఎంపీ మురళీ మోహన్ ప్రజల నుంచి వ్యక్తమవుతున్న విమర్శలను ప్రస్తావించారట. టీడీపీకి చెందిన కేంద్రమంత్రులు రాజీనామాలు చేయకుండా ఇంకా పదవులను పట్టుకుని వేలాడుతున్నారని జనం చర్చించుకుంటురన్న సంగతి చెప్పారట.

     ఇదిగో రాజీనామా లేఖ: కేంద్రమంత్రి

    ఇదిగో రాజీనామా లేఖ: కేంద్రమంత్రి

    మురళీ మోహన్ ఆ మాటన్నారో లేదో.. సమావేశంలో ఉన్న కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు లేచి నిల్చున్నారట. తన ప్యాంటు జేబులో నుంచి ఓ పేపర్ బయటకు తీసి ఇదిగో 'రాజీనామా లేఖ'.. జేబులోనే పెట్టుకుని తిరుగుతున్నా అని బదులిచ్చారట.

    ఇప్పుడంటే.. ఇప్పుడే:

    ఇప్పుడంటే.. ఇప్పుడే:

    అధినేత ఎప్పుడు ఆదేశిస్తే అప్పుడు రాజీనామా చేయడానికి తాను సిద్దంగా ఉన్నానని, ఇప్పుడంటే ఇప్పుడు తాను సిద్దమని అశోక్ గజపతిరాజు చెప్పారట. ఆయన సమాధానంతో మురళీమోహన్ సహా మిగతా ఎంపీలు మరో కేంద్రమంత్రి సుజానాచౌదరి ఆశ్చర్యపోయారట.

    ఏదో ఒక రోజు పేల్చాల్సిందే కదా..:

    ఏదో ఒక రోజు పేల్చాల్సిందే కదా..:

    ఇదే విషయంపై సమావేశానంతరం కొంతమంది ఎంపీలు మళ్లీ ఆయన్ను అడిగారట. 'ఇదేంటి రాజు గారూ.. జేబులో బాంబును పెట్టుకుని తిరుగుతున్నారు' అన్నారట. దీంతో ఏదో ఒక రోజు పేల్చాల్సిందేగా అన్నారట నవ్వుతూ. పదవులు తనకు పెద్ద లెక్క కాదని, తృణప్రాయంగా వదిలేస్తానని చెప్పుకొచ్చారట.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+