ఏపీలో అస్థిరత; రాజధాని ఏది అంటే ఏం చెప్పాలి సీఎం జగన్? అశోక్ గజపతి రాజు, బోండా ఉమా ఫైర్
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానుల బిల్లులను తాత్కాలికంగా రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీలో సీఎం జగన్ మోహన్ రెడ్డి న్యాయపరంగా ఉన్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని దీనిని రద్దు చేస్తున్నామని మళ్లీ పూర్తి, సమగ్రమైన, మెరుగైన బిల్లుతో సభ ముందుకు వస్తామని ప్రకటన చేశారు. మూడు రాజధానుల బిల్లును రద్దు చేస్తున్నాము కానీ మూడు రాజధానులు కాదంటూ ఏపీ మంత్రులు దీనిపై క్లారిటీ ఇస్తున్నారు. ఖచ్చితంగా మూడు రాజధానుల ఏర్పాటు జరిగి తీరుతుందని, నిర్ణయాన్ని మార్చుకునేది లేదని, వెనక్కు తగ్గేది లేదని తేల్చి చెబుతున్నారు.

ఏపీలో అస్థిరత పెద్దస్థాయిలో నెలకొంది
ఈ నేపథ్యంలో సీఎం జగన్మోహన్ రెడ్డి తాజా ప్రకటనతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనిశ్చితి నెలకొందని తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటే ఏదో చెప్పలేని పరిస్థితి ఏపీ ప్రజలకు ఉందని, జగన్ మూడు రాజధానులు నిర్ణయంతో రాజధాని నగరంగా ఉన్న అమరావతితో పాటుగా ఏ ప్రాంతంలో అభివృద్ధి చెందకుండా అభివృద్ధి శూన్యంగా మారాయని అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో అస్థిరత పెద్దస్థాయిలో నెలకొందని టిడిపి నేతలు మండిపడుతున్నారు.

అస్థిరత పెరగటం వల్ల పొరుగు రాష్ట్రాల కంటే వెనక్కు ఏపీ
తాజాగా ఇదే విషయాన్ని వెల్లడించినట్లు టీడీపీ నేత అశోక గజపతి రాజు అస్థిరత పెరగడం వల్ల అన్ని అవకాశాలు పోయి పొరుగు రాష్ట్రాల కంటే వెనకబడతామని జగన్ సర్కార్ కు హెచ్చరికలు జారీ చేశారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి పాత చట్టాన్ని ఉపసంహరించుకుని కొత్త చట్టంతో వస్తామని చెప్పిన దానికి అర్థం పర్థం లేదని ఆయన విమర్శించారు. ప్రతిపక్ష నేతగా అమరావతిని స్వాగతించిన జగన్మోహన్ రెడ్డి, అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని అమరావతిని విస్మరించి మూడు రాజధానుల మంత్రం జపిస్తూ ఉన్నారని అశోక్ గజపతి రాజు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

విశాఖలో భవనాలకు రంగులేస్తే రాజధాని అవుతుందా?
విశాఖలో భవనాలకు రంగులేస్తే రాజధాని అవుతుందా అంటూ ప్రశ్నించిన అశోక్ గజపతిరాజు, వికేంద్రీకరణ అంటే నవ్వులాట? అంటూ ప్రశ్నించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో తీసుకున్న నిర్ణయాల్లో కొన్ని నిర్ణయాలు చాలా భయాందోళన కలిగిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. జగన్ హయాంలో ఒక తలనొప్పి పోతే మరో తలనొప్పి వస్తుందని, రెండు నాలుకల ధోరణితో ప్రభుత్వం వ్యవహరిస్తోందని అశోక్ గజపతి రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు అభివృద్ధి అంటే ఏంటో జగన్మోహన్ రెడ్డి చెప్పాలని ప్రశ్నించారు.

మన రాజధాని ఏంటి? అని అడిగితే ఏం చెప్పాలి సీఎం గారు..: బోండా ఉమా
ఇదిలా ఉంటే టిడిపి నేత బోండా ఉమ వైసీపీ సర్కార్ తీసుకున్న నిర్ణయంపై జగన్మోహన్ రెడ్డిని ఆసక్తికరమైన ప్రశ్న అడిగారు. 3 రాజధానుల బిల్లు వెనక్కి తీసుకున్నారు సరే...ఇప్పుడు మన రాజధాని ఏంటి అని పిల్లలు అడిగితే ఏం చెప్పాలి ముఖ్యమంత్రి గారు? అంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేశారు బోండా ఉమ. జగన్ మూడు రాజధానుల బిల్లు రద్దు నిర్ణయం వెనుక కోర్టులో బిల్లు చెల్లదన్న భయం ఉందని బోండా ఉమా అభిప్రాయం వ్యక్తం చేశారు.
Recommended Video

వైసీపీ తప్పు చేసిందని అర్ధమైంది: ఎమ్మెల్సీ అశోక్ బాబు
మూడు రాజధానుల రద్దుతో జగన్ నాటకానికి బ్రేక్ పడిందని, వైసిపి నాయకులు తప్పు చేసినట్లుగా అర్థమైందని టిడిపి ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు పేర్కొన్నారు. రైతుల 700 రోజుల పోరాటానికి ఫలితం వచ్చిందని, ప్రభుత్వం మూడు రాజధానులు మద్దతుగా అమరావతి పోరాటానికి వ్యతిరేకంగా మూడు రాజధానులు కోసం పోరాటం సాగించేలా ఓ సమూహాన్ని రంగంలోకి తీసుకు వచ్చిందని, ఈరోజు మూడు రాజధానుల రద్దు ప్రకటన చేసిన వారు ఎందుకు స్పందించలేదో అందరికీ తెలుసని అశోక్ బాబు పేర్కొన్నారు. పెయిడ్ ఆర్టిస్టులు ఎవరన్నది ప్రజలకు తెలుసన్నారు. ప్రభుత్వ తలతిక్క నిర్ణయాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజధానిపై అనిశ్చితి నెలకొందని వెల్లడించారు ఎమ్మెల్సీ అశోక్ బాబు.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications