వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జైల్లో ఉండాల్సిన వారు నీతులు చెబుతున్నారు: జగన్‌పై అశోక్

|
Google Oneindia TeluguNews

విజయనగరం: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై కేంద్ర విమానయాన శాఖ మంత్రి పరోక్ష విమర్శలు చేశారు. జైళ్లలో ఉండాల్సిన వారు నీతులు చేబుతున్నారని మండిపడ్డారు. ఇచ్చిన హామీలన్నింటినీ తెలుగుదేశం ప్రభుత్వం నెరవేరుస్తోందని చెప్పారు.

విజయనగరం జిల్లా ద్వారంపూడి గ్రామాన్ని కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు శనివారం దత్తత తీసుకున్నారు. ఈ సందర్భంగా మొక్కలు నాటి, రోడ్లకు శంకుస్థాపన చేశారు.

ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తాం: యనమల

తూర్పుగోదావరి: ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలు కచ్చితంగా నెరవేరుస్తామని ఏపి మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. ఇప్పటికే రుణమాఫీ, పింఛన్ల కేటాయింపు కింద రూ. 10వేల కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. మామిడికుదురు మండలంలోని గోగన్నమఠం గ్రామంలో శనివారం నిర్వహించిన టిడిపి జిల్లా సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు.

 Ashok Gajapti Raju fires at YS Jagan

మార్చి నెలాఖరు నాటికి డిఎస్సీ ద్వారా పదివేల మంది ఉపాధ్యాయులను, 6వేల మంది వ్యవసాయ విస్తరణ అధికారులను నియమిస్తామని ఆయన చెప్పారు. ఉపాధ్యాయుల సంఘాలతో చర్చించి పిఆర్సీని అమలు చేసేందుకు కృషి చేస్తామని అన్నారు. అర్హులైన వారిని నామినేటెడ్ పదవులకు ఎంపిక చేసేందుకు కార్యాచరణ జరుగుతోందన్నారు.

‘ఎన్టీఆర్‌ సుజల స్రవంతి'ని ప్రారంభించిన మంత్రి రావెల

కడప: పేదలకు రెండు రూపాయలకే 20లీటర్ల మినరల్‌ వాటర్‌ అందిచాలనే ఉద్దేశ్యంతో సీఎం చంద్రబాబు ప్రారంభించిన ఎన్టీఆర్‌ సుజల స్రవంతి పథకంలో భాగంగా ముద్దనూరు మండలం చింతకుంటలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్‌ సుజల స్రవంతి వాటర్‌ప్లాంట్‌ను రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి రావెలకిషోర్‌ శనివారం ప్రారంభించారు. ఎంపీ సీఎం రమేష్‌, ప్రభుత్వ విప్‌ మేడా మల్లికార్జున్‌రెడ్డి, ఇతర టీడీపీ నేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

English summary
Union Minister Ashok Gajapti Raju on Saturday fired at YSR Congress Party president YS Jaganmohan Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X