Raghurama పోరు దారితప్పుతోందా ? రాజద్రోహం సెక్షన్ రద్దు డిమాండ్- కేంద్రానికే గురిపెట్టారా ?
వైసీపీ నుంచి ఎంపీగా గెలిచి ఆ పార్టీపైనే ఏడాదిన్నరగా పోరాడుతున్న రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు తాజాగా తనపై ఏపీ సీఐడీ నమోదు చేసిన రాజద్రోహం సెక్షన్‌కు వ్యతిరేకంగా పోరు ప్రారంభించారు. ఈ సెక్షన్‌ను ఐపీసీ నుంచి తొలగించాలంటూ కేంద్రానికి అసెంబ్లీ తీర్మానాలు చేసి పంపాలంటూ ముఖ్యమంత్రులకు ఆయన రాసిన లేఖ కలకలం రేపుతోంది. అయితే రాజద్రోహం సెక్షన్‌ను తొలగించడం అంత సులువా ? అన్నిరాష్ట్ర అసెంబ్లీ తీర్మానాలు చేసి పంపుతాయా ? పంపినా కేంద్రం ఈ సెక్షన్ తొలగిస్తుందా ? ఇవన్నీ తెలిసీ రఘురామరాజు దీనిపై చర్చను ఎందుకు లేవనెత్తారు ?

రాజద్రోహం సెక్షన్
అధికారంలో ఉన్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా హింసాత్మక రూపంలో జరిగే నేరపూరిత కుట్రపై మాత్రమే రాజద్రోహం సెక్షన్‌ను (సెక్షన్ 124ఏ) ప్రయోగించాలంటూ సుప్రీంకోర్టు తాజాగా మరోసారి గుర్తుచేసింది. అయితే ఏపీ ప్రభుత్వం అంతకంటే ముందే తమకు వ్యతిరేకంగా నిత్యం విమర్శలకు దిగుతున్న రఘురామరాజుపై ఈ సెక్షన్ కింద అభియోగాలు మోపింది. ఈ కేసు ఎంతవరకు నిలబడుతుందో నిర్దిష్టంగా చెప్పలోకపోయినా ఇప్పుడు అదే సెక్షన్‌ను తొలగించేందుకు రఘురామరాజు మొదలుపెట్టిన పోరు మాత్రం చర్చనీయాంశం అవుతోంది.

అసెంబ్లీ తీర్మానాలు సాధ్యమేనా ?
రాష్ట్రాలకు సంబంధించిన అంశాల్ని, సమస్యల్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు అసెంబ్లీ తీర్మానాలు చేసి పంపుతుంటాయి. వీటిని కేంద్రం ఆమోదించే సందర్భాలూ తక్కువే. అయినా ప్రభుత్వాలు రాజకీయ ప్రయోజనాల కోసం ఇలాంటి తీర్మానాలు చేసి పంపుతుంటాయి. ఇప్పుడు వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామరాజు ఏకంగా ఐపీసీలో ఓ సెక్షన్ తొలగించాలంటూ తీర్మానం చేసి పంపాలంటూ ముఖ్యమంత్రుల్ని కోరారు. దీంతో అసలు రఘురామ మాట విని ముఖ్యమంత్రులు తీర్మానాలు ఎందుకు చేస్తారన్న చర్చ సాగుతోంది. ఇందులో చాలా మంది ముఖ్యమంత్రులు తమకు గిట్టని వారిపై గతంలో రాజద్రోహం కేసులు ప్రయోగించినవారే.

కేంద్రం చేతుల్లో ఆయుధంగా రాజద్రోహం సెక్షన్
గతంలో యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ రాజద్రోహం సెక్షన్ కింద చాలా మందిపై కేసులు పెట్టారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన మోడీ సర్కార్ తొలి ప్రభుత్వ హయాంలోనూ, రెండో ప్రభుత్వ హయాంలోనూ విచ్చలవిడిగా రాజద్రోహం కేసుల్ని నమోదు చేస్తోంది. తమకు వ్యతిరేకంగా గొంతెత్తిన వారిపై కేంద్రంలో ఎన్డీయే సర్కారుతో పాటు బీజేపీ పాలిత ప్రభుత్వాలు కలిసి దాదాపు ఏడు వేలకు పైగా రాజద్రోహంతో పాటు జాతీయ భద్రతా చట్టాన్ని ప్రయోగించాయి. దీంతో కేంద్రం రాజద్రోహం సెక్షన్‌ను ఏ స్దాయిలో తమకు అనుకూలంగా వాడుకుంటుందో అర్ధమవుతోంది.
Recommended Video

రఘురామ బాణం కేంద్రానికి తగులుతుందా ?
కేంద్రంతో పాటు బీజేపీ పాలిత ప్రభుత్వాలు విచ్చలవిడిగా ప్రయోగిస్తున్న రాజద్రోహం సెక్షన్‌ను ఐపీసీ నుంచి తొలగించాలంటూ అవే ప్రభుత్వాల ముఖ్యమంత్రులకు రఘురామ లేఖ రాశారు. దీంతో రఘురామ లేఖలపై ఆయా ప్రభుత్వాలు స్పందించి అసెంబ్లీ తీర్మానాలు చేయడం సాధ్యమేనా అన్న చర్చ సాగుతోంది. ముఖ్యంగా ఒకటీ అరా అసెంబ్లీలు తీర్మానం చేసి పంపినా కేంద్రం వాటిని ఆమోదిస్తుందా అన్న చర్చ కూడా జరుగుతోంది. మరి కేంద్రాన్ని కాదని కేంద్రానికి వ్యతిరేకంగా రాజద్రోహం సెక్షన్‌పై ముఖ్యమంత్రుల్ని రెచ్చగొట్టడం ద్వారా రఘురామ ఏం కోరుకుంటున్నారు ? తనపై దాఖలైన రాజద్రోహం సెక్షన్ రద్దుకు రఘురామ ప్రయత్నిస్తుండటం అంతిమంగా ఏపీ ప్రభుత్వం కూడా రాజద్రోహం సెక్షన్‌ను ప్రయోగిస్తోందన్న అంశాన్ని వివిధ పార్టీల దృష్టికి తీసుకెళ్లేందుకు మాత్రమే ఉపయోగపడనుంది. రఘురామ కూడా ఇదే కోరుకుంటున్నట్లు తెలుస్తోంది.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై












Click it and Unblock the Notifications