సుదీర్ఘంగా జరిగిన క్యాబినెట్ భేటీ: 12 నుంచి అసెంబ్లీ

కృష్ణా జలాలపై బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుపై సుదీర్ఘంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఈ తీర్పుపై అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయాలని, ఆ తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్లాలని మంత్రి వర్గ సమావేశం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
కేవలం ఎజెండాకు మాత్రమే మంత్రి వర్గ సమావేశం పరిమితమైనట్లు తెలుస్తోంది. తుపాను బాధిత రైతులను ఆదుకుంటామని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చెప్పినట్లు తెలుస్తోంది. తుపాను బాధితులకు అందించాల్సిన సహాయం గురించి మంత్రి సి. రామచంద్రయ్య సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది.
చిత్తూరు జిల్లా మంచినీటి పథకంపై రాష్ట్ర మంత్రి వర్గంలో చర్చ జరిగినట్లు తెలుస్తోంది. మంచి నీటి పథకంపై టెండర్ల ఖరారు అంశాన్ని ముఖ్యమంత్రి మంత్రి వర్గ సమావేశం ముందు పెట్టినట్లు తెలుస్తోంది. సత్ప్రవర్తన కలిగిన జీవిత ఖైదీల విడుదల మార్దదర్శకాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 20 శాతం నుంచి 39 శాతం వరకు అంగవైకల్యం ఉన్నవారికి రూ. 200 మేర పింఛనును అందించేందుకు కూడా మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది.
మావోయిస్టు పార్టీతో పాటు ఏడు తీవ్రవాద సంఘాలపై మరో ఏడాది నిషేధం పొడగింపునకు మంత్రి వర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మావోయిస్టు దాడుల్లో మరణించినవారి కుటుంబాలకు నష్టపరిహారం పెంపునకు, జిహెచ్ఎంసిలో మున్సిపల్ చట్టం సవరణ బిల్లుకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది.












Click it and Unblock the Notifications