నివేదిక వచ్చాకే ఎపికి సాయం: వెంకయ్య.... టీ, ఎపి మధ్య అప్పుల పంపకం

న్యూఢిల్లీ/ విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయి నివేదిక వచ్చిన తర్వాత వరద సాయం అందిస్తామని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు చెప్పారు. వరద సాయంపై కేంద్ర మంత్రులు అరుణ్‌ జైట్లీ, రాజ్‌నాథ్‌, పీఎంవో ముఖ్య కార్యదర్శితో మాట్లాడానని తెలిపారు. కేంద్ర బృందాలను పంపుతామని రాజ్‌నాథ్‌ హామీ ఇచ్చారని ఆయన వివరించారు.

ఫైనాన్స్‌ కమిషన్‌ సిఫార్సుల మేరకే వరద సాయం అందిస్తామని వెంకయ్యనాయుడు తెలిపారు. ఎస్‌డీఆర్‌ఎఫ్‌ నిధులను ఖర్చు చేసిన తర్వాత జాతీయ విపత్తు నిధినుంచి ఏపీకి తక్షణ సాయం అందిస్తామని అన్నారు. తమిళనాడుకు ప్రత్యేక సాయం చేయలేదన్న ఆయన పెండింగ్‌ నిధులు అన్ని కలిపి రూ. 939 కోట్లు మాత్రమే ఇచ్చామని వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు.

Venakaiah Naidu

విభజన నాటికి ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ మధ్య నెలకొన్న అప్పుల పంపకం వివాదం ఓ కొలిక్కి వచ్చింది. జనాభా నిష్పత్తి ప్రకారం అప్పులు పంచుకోవాలని సూచించింది. ఆంధ్రప్రదేశ్‌ 52.32 శాతం, తెలంగాణ 41.68 శాతం నిష్పత్తిలో రూ. ఒక లక్షా 48వేల కోట్లు అప్పులు పంచుకోవాలని కేంద్రప్రభుత్వం సూచించింది.

దాదాపు 20,512 కోట్ల రూపాయల అప్పుల విషయంలో ఇరు రాష్ర్టాల మధ్య వివాదం ఉంది. అందులో రూ. 13,222 కోట్లు చెల్లించేందుకు తెలంగాణ ప్రభుత్వం అంగీకరించకపోవడంతో వివాదం ప్రారంభమైంది. రెండు రాష్ర్టాల ప్రభుత్వాలతో అకౌంటెంట్‌ జనరల్‌ చర్చలు జరిపారు. అయితే రూ. 8,737 కోట్ల అప్పులను ఇరువురికి సమానంగా పంచాలని రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కోరాయి.

బాక్సైట్ తవ్వకాలపై చంద్రబాబు శ్వేతపత్రం

క్సైట్‌ తవ్వకాలపై ఏపీ ప్రభుత్వం మంగళవారం శ్వేతపత్రం విడుదల చేసింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. ఏపీ మినహా అన్ని రాష్ట్రాల్లో బాక్సైట్‌ తవ్వకాలు జరుపుతున్నట్లు చెప్పారు. ఒడిశా తర్వాత ఏపీలో అపారమైన బాక్సైట్‌ నిక్షేపాలున్నాయని ఆయన చెప్పారు. బాక్సైట్‌ తవ్వకాలపై వైయస్ ప్రభుత్వం అనుసరించిన విధానాలను ఈ సందర్భంగా సీఎం ప్రస్తావించారు.

అప్పటి సీఎస్‌ను కాదని బాక్సైట్ తవ్వకాలకు వైఎస్‌ ఆదేశాలిచ్చారని ఆయన చెప్పారు. వైఎస్‌ ప్రభుత్వం ఏకపక్షంగా రస్‌అల్‌ఖైమాతో ఎంఓయూ కుదుర్చుకుందన్నారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో మైనింగ్‌ నిర్వహించాలని 1975లోనే జీవో తెచ్చారని, రాష్ట్ర ప్రభుత్వం మైనింగ్‌ నిర్వహించుకోవచ్చని 1997లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని చంద్రబాబు గుర్తు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+