కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చనిపోయింది....పాడే ఎక్కించే సమయానికి ప్రాణం తో లేచింది

By Oneindia Staff Writer
|
Google Oneindia TeluguNews

తూర్పు గోదావరి: పాడేక్కించే సమయంలో పెద్దావిడ బతికి బట్టకటింది..తూర్పుగోదావరి జిల్లా రాజానగరం చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ కార్యదర్శి పెదపాటి బుచ్చిరాజు భార్య కమల(65) రాజమహేంద్రవరంలో తన కుమార్తెను చూసేందుకు వెళ్లి మేడ మెట్లపై నుంచి కాలుజారి పడటంతో తలకు బలమైన గాయాలయ్యాయి.

ఆమెను ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స చేయించారు. గురువారం ఆమె పరిస్థితి విషమంగా ఉందని, వెంటిలేటర్‌ సాయంతో చికిత్స చేయాలని, అయినా ప్రాణం నిలబడుతుందన్న నమ్మకం లేదని ఆస్పత్రి వర్గాలు చెప్పడంతో బంధువులు అందుకు సిద్ధమయ్యారు.

ఇంతలో బంధువుల్లో ఒకరు ఆమె చనిపోయిందని.. వైద్యులు ఇంటికి తీసుకెళ్లిపొమ్మన్నారని చెప్పడంతో రాజమహేంద్రవరంలోని ఆమె కుమార్తె ఇంటికి తీసుకొచ్చారు. రాజానగరంలోని బట్టల వర్తకులు సంతాపాన్ని పాటిస్తూ దుకాణాలు మూసివేశారు.

విదేశాల్లో ఉన్న మనవడి కోసం ఆమెను గురువారం రాత్రంతా ఉంచారు. శుక్రవారం అంతిమయాత్రకు ఏర్పాట్లు చేస్తున్న సమయంలో ఆమె కదులుతుందని గమనించిన అక్కడున్నవారు బతికే ఉందని తెలిపారు. దీంతో బంధువులు స్పూన్‌తో పాలు కమల నోట్లో పోయడం, వాటిని ఆమె మింగడంతో బతికుందని నిర్ధారించుకున్న బంధువులు హుటాహుటిన కాకినాడ ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యం అందిస్తున్నారు.

కర్నూలు జిల్లాలో మరో శవం లేచి కూర్చుంది

కర్నూలు: కర్నూలు జిల్లా మిక్కినేని పల్లి లో మరో శవం లేచి కూర్చుంది. గ్రామంలో ఐదుగురు రైతులు పొలం పనికి వెళ్తుండగా కరెంట్ షాక్ తగిలి మృతి చెందిన ఘటన తెల్సిందే. ఒకే కుటుంబానికి చెందిన సుకూరు భాషా, ఉప్పరి సుధాకర్, ప్రవల్లిక, రజిత, ముద్దమ్మ లు తమ పొలాలకు పందులు రాకుండా చుట్టూ కరెంట్ కంచె వేశారు.

రాత్రి పొలం పనులు చేస్తుండగా భారీగా కురుస్తున్న వర్షాలకు విద్యుతు షార్ట్ సర్క్యూట్ అయ్యి కుటుంభం మొత్తం బలయ్యారు. సంఘటన ప్రాంతానికి చేరిన పోలీసులు డెడ్ బాడీలను రికవరీ చేసి పోస్టుమార్టం కు తరలించారు. ఐతే అక్కడ మార్చురీ రూములో ముద్దమ్మ అనే మహిళ లేచి కూర్చుంది.మరణించింది అనుకున్న ముద్దమ్మ ని చూసి అందరూ ఆచర్యపోయారు.డాక్టర్ పరిశీలించి ఆమె కరెంట్ షాకుతో కోమాలోకి వెళ్లినట్టు తెలిపారు.ఇప్పుడు ఆమెకు ప్రాణం రావటం తో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

English summary
A woman in East Godavari district of Andhra Pradesh assumed to be dead is alive.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X