చంపేవరకు తాళిబొట్టు వేసుకోమన్నారు: నాగరాజు
హైదరాబాద్: తనపై కాల్పులు జరిపించింది తన వియ్యంకుడైన బూతం గోవింద్, ఆయన సోదరుడు శ్రీనివాసేనని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జ్యోతిష్యుడు నాగరాజు శుక్రవారం వెల్లడించారు. శ్రీనివాస్ అనుచరులతో కాల్పులు జరిపించాడని అన్నారు. కాల్పులు జరిపిన వారికి పశ్చిమగోదావరి జిల్లా పోలీసుల అండదండలు ఉన్నాయని నాగరాజు ఆరోపించారు.
ఈ నెల 6వ తేదీ లోపు తనను హతమార్చుతామని బూతం బ్రదర్స్ కుటుంబ సభ్యులు గ్రామంలో ప్రచారం చేస్తున్నారని చెప్పారు. సంవత్సరం క్రితం హత్యకు గురైన బి.దుర్గారావు భార్య నాగమ్మ, వారి బంధువులు తిరుపతమ్మ, కొండమ్మతో పాటు తన కోడలు ఉమాదేవి కూడా తనను హత్య చేసే వరకు తాళిబొట్లు వేసుకోబోమని శపథం చేసినట్టు నాగరాజు చెప్పారు. వారి నుంచి తనకు ప్రాణహాని ఉందన్నారు.

నివాస్, గోవింద్‌ను పట్టుకునే వరకు ప్రాణరక్షణ లేదన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబు ఆయా రాష్ట్రాల్లోని కేసులపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని కోరారు. దుర్గారావు హత్యకేసులో సంబంధం లేకున్నా తన పేరు ఇరికించారని ఆవేదన వ్యక్తం చేశారు.
తన భార్య, బిడ్డలపై నెల రోజుల క్రితం ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారని వాపోయారు. తనను హతమార్చేందుకు ఢిల్లీ గ్యాంగ్‌కు సుపారి ఇచ్చి ఉంటారని అనుమానం వ్యక్తం చేశాడు. కాల్పులు జరిపిన నిందితులను గుర్తుపట్టలేనన్నారు. తన ఇంటి సమీపంలో ఉన్న డ్రైక్లీనింగ్ వ్యక్తి గుర్తుపట్టవచ్చన్నాడు.
-
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
మ్యాచ్ గెలిచినా.. ఆనందం లేకపాయె -
దళపతితో చేతులు కలిపిన దీదీ, ఇండియా కూటమిలో ప్రకంపనలు -
జన్మ నక్షత్రం మృగశిర, ఆరుద్ర ఉన్నవారి మే నెల జాతక ఫలం -
ఎంత సీఎం అయినా.. !! -
DA సున్నా?: ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పీక్స్! శాలరీ హైక్ రిపోర్ట్ -
సీనియర్ ఎన్టీఆర్‌కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ వరం, ఇక కొత్త రూపు..!! -
Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ సంపాదన, ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!!












Click it and Unblock the Notifications