ఎగ్జిట్ పోల్స్ తర్వాత సీఎం ఎవరో చెప్పిన వేణు స్వామి
ప్రముఖ జ్యోతిషుడు వేణు స్వామి మరోసారి వార్తల్లో నిలిచారు. తాజాగా విడుదలైన ఎగ్జిట్ పోల్స్‌పై ఆయన స్పందించారు. సర్వేలు ఇప్పుడు జగన్ సీఎం అవుతారని చెబుతున్నారని..తాను గడిచిన నాలుగేళ్లుగా జగనే సీఎం అని చెబుతున్నానని ఆయన తెలిపారు. నేను రోజుకో మాట మాట్లాడానికి రాజకీయ విశ్లేషకుడును కాదని.. జ్యోతిషుడనని ఒక్కసారి చెప్పిన మాట మీదే తాను నిలబడతానని ఆయన వేణు స్వామి తెలిపారు. నేను ఇప్పటికే వందసార్లు చెప్పాను. మళ్లీ ఏపీలో 2024లో సీఎం అయ్యేది జగన్ అని ఆయన మరోసారి పునర్ఘటించారు.
ఆయన జాతక ప్రకారం సీఎం అయ్యే యోగం ఉంది. జగన్‌ది ఆరుద్ర నక్షత్రం 2023 నుంచి అష్టమన శని మొదలైంది. రెండున్నర సంవత్సరాలు ఉంటుంది. అయినా అది మంచి స్థానంలో ఉంది. దీన్ని బట్టి సీఎం అయ్యేది ఆయనే అని అర్థం చేసుకోవచ్చు. అలాగే చంద్రబాబుది పుష్యమి నక్షత్రం పవన్ కల్యాణ్‌ది ఉత్తరాషాడ నక్షత్రం 2017 నుంచి 2025 వరకు శని ఉంది. జూలై వరకు దాని ప్రభావం ఉంటుందని వేణు స్వామి తెలిపారు. టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకున్న తర్వాత వైసీపీ విజయం ఖాయమైందని వేణు స్వామి వ్యాఖ్యనించారు.

సర్వేలు, అందరు ఇప్పుడు జగన్ సీఎం అవుతారని చెబుతున్నారని..కానీ తాను మొదటి నుంచి కూడా జగనే సీఎం అని చెబుతున్నారనని ఆయన చెప్పుకొచ్చారు. ఎవరెన్ని చెప్పినా 2024లో జగనే సీఎం అవుతారని వేణు స్వామి కుండబద్దలు కొట్టేశారు. మరో 17 ఏళ్లు ఆయన్ను కదిలించే శక్తి ఏది లేదని వేణు స్వామి చెప్పుకొచ్చారు. అంటే మరో 17 సంవత్సరాల పాటు జగనే ఏపీకి సీఎంగా ఉంటారని ఆయన తెలిపారు. 2019 గెలిచిన జగన్ 2024,2029 ఎన్నికల్లో కూడా గెలుచి సీఎం అవుతారని వేణు స్వామి తెలిపారు.












Click it and Unblock the Notifications