జగన్‌కు అమిత్ షా ఫోన్: కన్నా చేరికపై అచ్చెన్నాయుడు సంచలనం
అమరావతి: ప్రధానమంత్రి నమ్మించి మోసం చేశారని నరేంద్ర మోడీపై ఏపీ ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. బీజేపీ నేతలు కుట్ర రాజకీయాలు చేస్తున్నారని మంత్రి విమర్శించారు.
Recommended Video

రాష్ట్ర ప్రజలకు ఇష్ట లేకున్నా రాష్ట్రాన్ని విభజించారని, హోదా సరైందని ఇప్పుడు బీజేపీ మాట తప్పిందని అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ఏపీకి న్యాయం చేస్తామని మోసం చేశారని ఆరోపించారు.

ఏప్రిల్ 30న తిరుపతిలో జరిగే టీడీపీ బహిరంగ సభ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు.
టీడీపీ సభకు 1.50 లక్షల మంది హాజరవుతారని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. దేశం మొత్తం తిరుపతి సభపై చర్చించేలా నిర్వహిస్తామన్నారు.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఫోన్ చేయడంతో.. వైసీపీలో కన్నా లక్ష్మీనారాయణ చేరిక వాయిదా పడిందని మంత్రి అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు.












Click it and Unblock the Notifications