విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రముఖ హేతువాది గోపరాజు లవణం ఇక లేరు

By Pratap
|
Google Oneindia TeluguNews

విజయవాడ: ప్రముఖ హేతువాది గోపరాజు లవణం(86) శుక్రవారం తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా ఆయన ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడలో గల రమేష్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం 9:56 గంటలకు కన్నుమూశారు. ఆయన గాంధేయవాది

సంఘం, ది ఎథిస్ట్‌, నాస్తిక మార్గం పత్రికలు లవణం సంపాదకీయంలో వెలువడ్డాయి. భారత నాస్తిక కేంద్రం డైరెక్టర్‌గా వ్యవహరించారు. చిన్నతనంలోనే స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్నారు. 1973లో విజయవాడ హేతువాద సంఘ అధ్యక్షుడిగా నియమితులయ్యారు.

Atheist Goparaju Lavanam no more

అప్పృశ్యత, కుల నిర్మూలన కోసం తీవ్రంగా కృషి చేశారు. ప్రముఖ కవి గుర్రం జాషువా కూతురు హేమలతను లవణం వివాహం చేసుకున్నారు. హేమలత కూడా మూఢనమ్మకాలపై పోరాటం చేశారు. సంస్కార్‌ సంస్థ ద్వారా జోగిని వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడారు. గాంధేయ విలువలకు కట్టుబడి సామాజిక అభ్యున్నతికి అంకితమై పనిచేస్తున్నందుకు లవణంకు 'జమునా లాల్‌బజాజ్‌' అవార్డు లభించింది.

సామాజిక చైతన్యానికి కృషి చేస్తున్న లవణం హేతువాదం, నాస్తికవాదంపై అనేక గ్రంథాలను రచించారు. సమాజంలో వేళ్లూనుకున్న మూఢ విశ్వాసాలు, మతమౌఢ్యానికి వ్యతిరేకంగా అనేక ఉద్యమాలను నడిపారు.

మరికాసేపట్లో లవణం మృతదేహాన్ని బెంచిసర్కిల్‌లోని నాస్తిక్‌ కేంద్రానికి తరలించారు. నేటి సాయంత్రం వరకు ప్రజల సందర్శనార్ధం భౌతికకాయాన్ని అక్కడే ఉంచనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. గోపరాజు రామచంద్రరావు (గోరా), సరస్వతి గోరాలకు ఆయన 1930లో జన్మించారు.

English summary
Prominent atheist Goparaju Lavanam passed away at Vijayawada in Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X