డబ్బులే డబ్బులు: ఏటిఎంలో వెయ్యి నొక్కితే రూ. 6500, 800కు..
శ్రీకాకుళం: ఏటీఎంలో నమోదు చేసిన దానికంటే ఆరింతలకు పైగా నగదు వస్తే ఏమవుతుంది. జనం ఆ ఏటిఎం ముందు బారులు తీరి డబ్బులను తీసుకునేందుకు ఎగబడతారు. అదే ఘటన సోమవారం శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో చోటుచేసుకుంది.
స్థానిక స్టేట్ బ్యాంకు ఏటీఎంలో ఖాతాదారులు రూ. వెయ్యి కావాలని నమోదు చేస్తే.. 6500, రూ. 800 నమోదు చేస్తే ఏకంగా 5,500 వచ్చాయి. ఈ విషయం ఆనోట ఈనోట అందరికీ తెలిసిపోయింది.
దీంతో జనాలు ఆ ఏటిఎం ముందు డబ్బులు తీసుకునేందుకు బారులు తీరారు. అదే సమయంలో ఆ కేంద్రానికి వెళ్లిన నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి పీఏ రాంబాబు ఏటీఎంలో సాంకేతిక లోపం తలెత్తినట్లు గమనించి బ్యాంకు మేనేజర్ శ్యామ్‌శేఖర్‌కు సమాచారం అందించారు.

దీంతో బ్యాంకు అధికారులు వెంటనే ఆ ఏటిఎం కేంద్రాన్ని మూసివేసి సంబంధిత నిర్వాహక ఏజెన్సీకి తెలియజేశారు. కాగా, ఆ ఏటిఎం ముందు వరుసకట్టిన జనం మాత్రం నిరాశతో వెళ్లిపోవాల్సి వచ్చింది.
భారీ అగ్నిప్రమాదం: 50 పూరిళ్లు దగ్ధం
తూర్పుగోదావరి: కాకినాడలోని గుడారిగుంటలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మూడు సిలిండర్లు పేలడంతో దాదాపు 50 పూరిళ్లు తగలబడ్డాయి. పేలుడు ధాటికి కొన్ని ఇళ్లు కుప్పకూలాయి. మంటలు ఉవ్వెత్తున ఎగసి పడ్డాయి.
అగ్నిప్రమాదంతో ప్రజలు భయభ్రాంతులకు గురై అక్కడి నుంచి పరుగులు తీశారు. మరోవైపు కళ్లముందే ఇళ్లు తగలబడిపోతుండడంతో స్థానికులు కన్నీరుమున్నీరుగా విలపించారు. సమాచారం అందుకున్నఅగ్నిమాపక శాఖ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు.












Click it and Unblock the Notifications