కేజీబివి స్కూల్‌లో దారుణం.. 18మంది స్టూడెంట్స్ జుట్టు కత్తిరించిన ఇంఛార్జీ..

పాఠ‌శాల‌కు ఆల‌స్యంగా వ‌చ్చార‌నే నెపంతో.. 18 మంది విద్యార్థినుల జుట్టు క‌త్తిరించింది హాస్ట‌ల్ అధికారి. ఈ సంఘ‌ట‌న ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని విశాఖ‌జిల్లాలో చోటుచేసుకుంది. ప్ర‌స్తుతం ఈ సంఘ‌ట‌న జ‌ల్లా వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టిస్తోంది. పూర్తి వివ‌రాలు ఇలా ఉన్నాయి..

జి.మాడుగల మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠ‌శాల‌లో ఈ అమానుషం చ‌ర్య చోటుచేసుకుంది. పాఠశాలకు ఆలస్యంగా వచ్చారని హాస్టల్ ఇంచార్జ్ ప్రసన్న కుమారి ఏకంగా 18 మంది విద్యార్థినుల జట్టు కత్తిరించింది. ప్రస్తుతం ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. అయితే, ఈ విష‌యం తెలుసుకున్న విద్యార్థినుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. ఇంతటి దారుణానికి పాల్ప‌డిన ఇంచార్జిని విధుల నుంచి వెంటనే తప్పించాలంటూ వారు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. మొన్నటికి మొన్న హెయిర్ కట్ సరిగా చేయించుకోలేదని ఓ ప్రొఫెసర్ విద్యార్థికి ఏకంగా గుండు కొట్టించిన సంఘ‌ట‌న మరువక ముందే ఇలాంటి ఘ‌ట‌నే మ‌రోకటి విశాఖపట్నం జిల్లాలో వెలుగు చూసింది.

Atrocities at KGBV school In-charge cuts hair of 18 students

క్రమశిక్షణ అలవర్చేందుకు..

పాఠ‌శాల‌లో స‌కాలంలో 23 మంది విద్యార్థినులు హాజ‌రుకాలేద‌ని హ‌స్ట‌ల్ ఇంచార్జీ సాయిప్రసన్న వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ విద్యార్థినుల్లో నలుగురిపై చేయి చేసుకున్నారు. అంత‌టితో ఆగ‌కుండా విద్యార్థినులను చాలాసేపు ఎండలో నిల్చోబెట్టారు. అందులో ఒకరు సొమ్మసిల్లి పడిపోయారు. ఆ తర్వాత మధ్యాహ్న భోజన సమయంలో 18 మంది విద్యార్థినుల జుత్తును కొద్ది గా కత్తిరించారు. బాధిత విద్యార్థినులు తల్లిదండ్రులకు తెలియజేయ‌డంతో ఈ విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. అయితే, ఈ విష‌యంపై ప్ర‌స‌న్న‌కుమారి మాట్లాడుతూ విద్యార్థునుల క్రమశిక్షణ అలవర్చేందుకు కొందరి జుత్తును కొద్దిగా కత్తిరించినట్లు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+