గుంటూరు జిల్లాలో దారుణం.. చిన్నారులపై మారుతల్లి కర్కశత్వం.. ఒకరు మృతి

గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు చిన్నారులపై మారుతల్లి కర్కశత్వం ప్రదర్శించింది. కవల కుమారుల్లో ఒకరిని అమానుషంగా హత్య చేయగా.. మరొకరిని తీవ్రంగా గాయపరిచింది. ఈ దారుణ ఘటన ఏపీ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే..

జిల్లాలోని యడ్లపాడు మండలం కొండవీడుకు చెందిన కంచర్ల సాగర్‌కు మొదటి భార్యతో ఇద్దరు కవల కుమారులు ఉన్నారు. అయితే, ఆయన తొలి భార్య రెండేళ్ల క్రితం మృతి చెందడంతో, ఫిరంగిపురానికి చెందిన లక్ష్మిని రెండో వివాహం చేసుకున్నారు. వీరికి 8 నెలల క్రితం ఓ ఆడబిడ్డ జన్మించింది. అయితే తన కన్న బిడ్డను మాత్రం ఆప్యాయంగా చూసుకునే లక్ష్మి.. సాగర్ తొలి భార్య పిల్లలను మాత్రం రోజూ చిత్రహింసలు పెట్టేదని తెలుస్తోంది.

atrocity-in-guntur-district-step-mothers-cruelty-towards-children-one-person-dies

బెల్టు, కర్రలతో వారిని తీవ్రంగా కొట్టేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే చిన్న కుమారుడు కార్తిక్‌ను తీవ్రంగా హింసించి, కర్రతో తలపై కొట్టి.. ఆ తర్వాత గొంతు నులిమి హత్య చేసింది. అంతే కాకుండా.. పెద్ద కుమారుడు ఆకాశ్‌ను గ్యాస్ పొయ్యిమీద వేడెక్కిన అట్లపెనంపై కూర్చోబెట్టి తీవ్రంగా గాయపరిచినట్టు సమాచారం. ఈ వికృత చర్యలకు సాగర్ కూడా సహకరించినట్లు వాదనలు వినిపిస్తున్నాయి. బాధిత బాలుర పరిస్థితిని గమనించిన గోశాల విజయ అనే మహిళ ఫిర్యాదు మేరకు, ఫిరంగిపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+