అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జనసేన కార్యకర్తలపై దాడి: మీ కుప్పిగంతులు నా దగ్గర కాదు.. జగన్-పీకేలకు బాబు వార్నింగ్

|
Google Oneindia TeluguNews

అమరావతి: తన నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో ఇప్పటి వరకు తనపై ఎవరూ కులముద్ర వేయలేదని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదివారం అన్నారు. తనపై కులముద్ర వేసేందుకు ఎవరూ సాహసించలేదు కూడా అన్నారు. కొందరు బీహారీ కన్సల్టెంట్‌ను పెట్టుకొని బీహారీ తరహా రాజకీయం చేశారని జగన్‌ను, ప్రశాంత్ కిషోర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. బీహార్‌లో రౌడీ రాజకీయం ఎక్కువ, ఇక్కడ వైసీపీ అదే చేస్తోందని అభిప్రాయపడ్డారు.

<strong>సర్వే: కాబోయే సీఎం జగన్, పవన్ కళ్యాణ్‌కు అందనంత ఎత్తులో, ఎవరికి ఎంతమంది ఓటేశారంటే?</strong>సర్వే: కాబోయే సీఎం జగన్, పవన్ కళ్యాణ్‌కు అందనంత ఎత్తులో, ఎవరికి ఎంతమంది ఓటేశారంటే?

 బీహార్ కుప్పిగంతులొద్దు.. పీకే, జగన్‌లకు బాబు హెచ్చరిక

బీహార్ కుప్పిగంతులొద్దు.. పీకే, జగన్‌లకు బాబు హెచ్చరిక

గుంటూరులో జనసేన, నెల్లూరులో కాంగ్రెస్ పార్టీ నేతల పైన వైసీపీ నాయకులు దాడి చేశారని చంద్రబాబు అన్నారు. ఇలాంటి రౌడీయిజాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని స్పష్టం చేశారు. బీహార్, యూపీలలో ఇలాగే చిచ్చుపెట్టారని మండిపడ్డారు. ఇప్పుడు ఏపీలోని కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. జగన్ కుప్పిగంతులు నా ముందు చెల్లవన్నారు. జగన్, ఆయన సలహాదారు ప్రశాంత్ కిషోర్ ఆటలు సాగనివ్వనని చెప్పారు. ఏపీకి ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అమలు చేయలేదని చెప్పారు.

 నాకు ఎవరూ ఆ గజ్జి అంటించలేకపోయారు.. జగన్ ప్రయత్నాలు

నాకు ఎవరూ ఆ గజ్జి అంటించలేకపోయారు.. జగన్ ప్రయత్నాలు

తాను నలభై ఏళ్లు రాజకీయాల్లో ఉన్నానని చెప్పారు, ఇప్పటి వరకు తనకు ఎవరూ కులముద్ర వేయలేకపోయారని, జగన్ మాత్రం తనకు ఆ ముద్ర వేసేందుకు ప్రయత్నాలు చేశారన్నారు. తాను హేమాహేమీలతో పోరాడానని చెప్పారు. విజయ భాస్కర రెడ్డి, చెన్నారెడ్డి, రాజశేఖర రెడ్డి, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీతోను పోరాడామని చెప్పారు. ఎవరూ తనపై కుల ముద్ర వేయలేదన్నారు. కానీ మొదటిసారి జగన్ తనకు ఉన్న కులగజ్జిని నాకు అంటించాలని చూస్తున్నారన్నారు. ప్రశాంత్ కిషోర్ బీహారీ అని, మన రాష్ట్రాన్ని బీహార్ చేయాలనుకుంటున్నాడని, పీకేతో కలిసి జగన్ బీహార్ తరహా రాజకీయాలకు కుట్ర చేస్తున్నారన్నారు. పీకే, జగన్ కుప్పిగంతులు నా ముందు చెల్లవన్నారు.

 కేసీఆర్‌కు భయం పట్టుకుంది

కేసీఆర్‌కు భయం పట్టుకుంది

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందని తెలంగాణ సీఎం కేసీఆర్‌కు భయం పట్టుకుందని చంద్రబాబు విమర్శించారు. రాష్ట్ర శాంతిభద్రతల అంశంపై కేంద్రం పెత్తనం చేస్తోందన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, వైసీపీ అధినేత వైయస్ జగన్, కేసీఆర్ ఏపీపై కుట్ర పన్నారని ఆరోపించారు. హైదరాబాదులో ఆస్తులు ఉన్న టీడీపీ నేతలకు బెదిరింపులు వస్తున్నాయని చెప్పారు. దేశంలో ప్రతిపక్ష నేతలపై మోడీ దాడులు చేయిస్తున్నారన్నారు. బాక్సైట్ తవ్వకాలను ప్రయివేటుపరం చేసింది వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలోనే అని చంద్రబాబు అన్నారు. ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లి వచ్చే వ్యక్తిపై విచారణ లేదని విమర్శించారు. దేశంలోని అవినీతిపరులను కేంద్రం కాపాడుతోందన్నారు. వైయస్ హయాంలో జగన్ అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. రాజకీయాలను జగన్ నేరమయం చేశారని దుమ్మెత్తిపోశారు.

English summary
andhra pradesh chief minister nara chandrababu naidu fired at ysr congress party chief ys jagan mohan reddy and prashant kishor for attacking on Janasena and Congresss activists.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X