నూజివీడు పోలీస్ స్టేషన్ పై దాడి
ఏలూరు జిల్లా నూజివీడు పోలీస్ స్టేషన్ పై ఫిర్యాదు దారులు దాడికి దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బాధితుల దాడితో పోలీసులు స్టేషన్ తలుపులు మూసేశారు. వివాహమైన మూడు నెలలకే తనను వరకట్నం కింద వేధిస్తున్నారంటూ ఒక మహిళ పోలీసులను ఆశ్రయించింది. అదనపు కట్నం కోసం భార్య ఐశ్వర్యను తీవ్ర వేధింపులకు గురి చేస్తున్న భర్త రాజ్ కుమార్ పై ఫిర్యాదు చేశారు. నిన్నటి నుంచి ఐశ్వర్య కనిపించకపోవటంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. రాజ్ కుమార్ ను పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు.

ఈ విషయం తెలిసిన వెంటనే పోలీస్ స్టేషన్ వద్ద రాజ్ కుమార్ వర్గం, ఐశ్వర్యం వర్గం గొడవకు దిగాయి. పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంవల్లే ఐశ్వర్య కనిపించడంలేదని ఆమె తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. అయితే ఈ వ్యవహారంలో రాజ్ కుమార్ తప్పేం లేదంటూ అతని కుటుంబ సభ్యులు చెబుతూ మరోపక్క స్టేషన్ పైకి దాడికి పాల్పడ్డారు. ఆగ్రహంతో ఉన్న మహిళలకు, పోలీసులకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది. గొడవ మరింత పెద్దది కాబోతుందని గ్రహించిన సీఐ, ఎస్ఐ స్టేషన్ గేట్లు మూసేశారు. తమ కుమార్తె జాడ చెప్పాలంటూ ఐశ్వర్య తల్లిదండ్రులు స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. వారితోపాటు వారి బంధువులు, గ్రామప్రజలు అక్కడకు చేరడంతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. జరిగిన విషయాన్ని పోలీసులు ఉన్నతాధికారులకు చేరవేశారు. పరిస్థితిని అంచనావేసి అవసరమైతే అదనపు బలగాలు పంపించడానికి రంగం సిద్ధం చేశారు.












Click it and Unblock the Notifications