రాయపాటి కారు పైన దాడి, ధ్వంసం: పలుచోట్ల ఉద్రిక్తం

ఈ ఘటనలో ఆయన కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. పోలీసుల సహకారంతో రాయపాటి అక్కడి నుండి బయటపడ్డారు. రాయపాటి పైన రాళ్ల దాడిని టిడిపి కార్యకర్తలు నిరసించారు. దాడిని ఖండించారు.
లక్ష్మారెడ్డిపై రామకృష్ణా రెడ్డి ఆగ్రహం
గుంటూరు జిల్లా మాచర్లలో టిడిపి నేత, మాజీ ఎమ్మెల్యే లక్ష్మా రెడ్డి ఇంటి ముందు ఎమ్మెల్యే రామకృష్ణా రెడ్డి హల్ చల్ చేశారు. లక్ష్మారెడ్డి డబ్బులు పంచుతున్నారని ఆయన ఆరోపించారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు తనను బెదిరిస్తున్నారని లక్ష్మారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
విశాఖపట్టణం జిల్లా ఎండాడ పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఎండాడ పోలింగ్ కేంద్రంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి దూరడంతో జగన్ పార్టీ, టిడిపి మధ్య వివాదం రాజుకుంది. ఇరువర్గాలు బాహాబాహీకి దిగాయి. ఈ ఘటనలో ఇరువర్గాలకు చెందిన పలువురు కార్యకర్తలు గాయపడ్డారు.












Click it and Unblock the Notifications