బాబు కనుసన్నల్లోనే రోజాపై దాడి: వాసిరెడ్డి పద్మ

రోజాకు చంద్రబాబు నాయుడు బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. రోజాపై దాడి తెలుగుదేశం పార్టీ అరాచకాలకు పరాకాష్ట అని వ్యాఖ్యానించారు. చంద్రబాబు ప్రజలకు ఏం సందేశం ఇవ్వదలుచుకున్నారని, ఇలాగే వ్యవహరిస్తే పోలీసు, న్యాయవ్యవస్థలు ఎందుకని ఆమె ప్రశ్నించారు.
దేవతలకు హారతి ఇస్తుండగా శనివారం ఉదయం నగరిలో శాసనసభ్యురాలు రోజాపై దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడికి నిరసనగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు నగరిలో ఆందోళనకు దిగారు. పోలీసు స్టేషన్ ఎదుట బైఠాయించారు.
తనపై జరిగిన దాడికి రోజా తీవ్రంగా ప్రతిస్పందించారు. తెలుగుదేశం పార్టీ నాయకుడు గాలి ముద్దు కృష్ణనాయుడిపై ఆమె విరుచుకుపడ్డారు. ముద్దుకృష్ణమ నాయుడి ప్రోద్బలంతోనే తనపై దాడికి పాల్పడ్డారని ఆమె ఆరోపించారు.












Click it and Unblock the Notifications