మా మీద ఏడుస్తావెందుకు: జగన్ ఘటన మీద బాబుపై పవన్, శివాజీ మక్కెలిరగ్గొడితే.. రోజా సవాల్
అమరావతి/హైదరాబాద్: కేంద్రం, తెలంగాణ సీఎం కేసీఆర్, జగన్, పవన్ కళ్యాణ్‌లు కలిసి రాష్ట్రం పైన కుట్ర చేస్తున్నారని వ్యాఖ్యానించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు జనసేన అధినేత కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు.
Recommended Video

ఈ మేరకు తన ట్విట్టర్ అకౌంటులో ఆయన ట్వీట్ చేశారు. చంద్రబాబు వ్యాఖ్యలకు తన స్పందన అంటూ.. ఉరుము ఉరిమి మంగళం మీద పడినట్లు ఎక్కడ ఏం జరిగినా చంద్రబాబు నాయుడు గారు, ఆయన వర్గీయులు మా మీద పడి ఏడుస్తారు ఎందుకు అని ప్రశ్నించారు.

శివాజీతో డ్రామాలు, అభిమాని అయితే అవేవీ
ఒక్క సినిమా అవకాశం లేకుండా ఖాళీగా ఏళ్ల తరబడి కూర్చున్న నటుడు శివాజీని ముందు పెట్టుకొని చంద్రబాబు ఆపరేషన్ గరుడ అంటూ కొత్త నాటకానికి తెరలేపారని రోజా కూడా ఆరోపించారు. జగన్ పైన దాడి జరిగిన గంట వ్యవధిలోనే నిందితుడు, జగన్ కలిసి ఉన్నారంటూ చూపించేలా మార్ఫింగ్ చేసిన ఫోటోలను మీడియాకు చూపించారన్నారు. జగన్ అభిమాని అయితే వెనుక విజయమ్మ, వైయస్ రాజశేఖర రెడ్డిల చిత్రాలు ఉంటాయని చెప్పారు. అదే విధంగా ఫ్లెక్సీని ముద్రించిన స్టూడియో పేరు తప్పనిసరిగా ఉంటుందని, అవేమీ లేవని చెప్పారు.

శివాజీని మక్కెలిరగ్గొడితే బయటకొస్తాయి
కొత్త నాటకానికి తెరలేపిన చంద్రబాబు, అడ్రస్ లేని హీరో శివాజీతో కలిసి డ్రామాలు ఆడిస్తున్నారని రోజా ధ్వజమెత్తారు. దానిని ఇప్పుడు నమ్ముతున్నానంటూ పిచ్చిపట్టినట్లుగా చంద్రబాబు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ముందుగా రాసిచ్చిన స్క్రిప్ట్‌ను శివాజీతో చెప్పించి, దానిని నడిపిస్తున్నది చంద్రబాబు అన్నారు. శివాజీనీ నడిపిస్తోంది చంద్రబాబా.. లోకేషా అని ప్రశ్నించారు. శివాజీని లోపల పడేసి మక్కెలు ఇరగ్గొడితే అసలు విషయాలు బయటకు వస్తాయన్నారు. ఆపరేషన్ గరుడ ఎవరు నడిపిస్తున్నారు, దాని సూత్రధారులు ఎవరో శివాజీ నోటి నుంచి బయటకు వస్తాయన్నారు.

అందుకే జగన్ హైదరాబాదుకు
ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ తనపై జరిగిన దాడి గురించి తెలుసుకున్న కార్యకర్తలు, అభిమానులు ఎమోషన్‌లో ఏదైనా చేసుకోవచ్చునని లేదా ఏదైనా చేయవచ్చుననే ఆలోచనతో అక్కడి నుంచి బయటపడాలనే ఉద్దేశ్యంతో హైదరాబాద్ వచ్చారని రోజా అన్నారు. అందువల్లే ఆన అక్కడి నుంచి షెడ్యూల్ ప్రకారం విమానం ఎక్కారని చెప్పారు. జగన్‌తో ఉన్నకొందరు, అక్కడే చికిత్స తీసుకుందామని చెప్పినా సున్నితంగా తిరస్కరించారని, ఆస్తినష్టం జరగరాదన్న ఉద్దేశ్యంతో జగన్ ప్రయాణం కొనసాగిస్తే తప్పుడు విమర్శలు చేస్తున్నారన్నారు. విమానాశ్రయం తమ పరిధిలో లేదని టీడీపీ చెబుతోందని, మరి గతంలో విశాఖ ఎయిర్ పోర్టు రాష్ట్ర పరిధిలోకి రాకుంటే రన్ వే పైన జగన్‌ను ఎనిమిది గంటలు ఎందుకు నిర్బంధించారో చెప్పాలన్నారు. విమానాశ్రయ అధికారుల అదుపులో దొరకని లేఖ ఆ తర్వాత ఏపీ పోలీసులకు అప్పగించిన తర్వాత ఎలా తెలిసిందని రోజా ప్రశ్నించారు. అల్లర్లు సృష్టించాలంటే జగన్ ఇక్కడే ఉండి సృష్టించేవారన్నారు. అసలు వైసీపీ నాయకుడిని టీడీపీ నేత తన క్యాంటీన్లో ఎలా ఉద్యోగానికి పెట్టుకుంటారా చెప్పాలని సవాల్ చేశారు. జగన్ ఇంటికి వెళ్లారని టీడీపీ నేతలు చెబుతున్నారని, అది నిరూపించకుంటే రాజీనామా చేస్తావా అని చంద్రబాబుకు సవాల్ చేశారు.

చంద్రబాబు వెకిలి నవ్వు
జగన్ గుండె నిబ్బరంతో హైదరాబాదుకు వచ్చి ఆసుపత్రిలో చేరారని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. ఏపీ ప్రభుత్వ స్పందన బాధ వేసిందన్నారు. నేతలు గొప్పవారో కాదో ప్రజలే తేలుస్తారని అన్నారు. వైయస్ జగన్ పైన దాడి జరిగిన విషయం తెలియగానే పవన్, కేసీఆర్, కేటీఆర్, కవిత, సీపీఎం, సీపీఐ నేలు స్పందించారని చెప్పారు. కానీ చంద్రబాబు మీడియా సమావేశంలో వెకిలి నవ్వులు నవ్వుతూ మాట్లాడారని, దీని వల్ల 3 గంటల సమయం వృథా అయినట్లు కామెంట్లు చేశారన్నారు. చంద్రబాబు లోపల ఉండే ద్వేషాన్ని బయట పెట్టుకున్నారన్నారు.

మరి పోలీస్ స్టేషన్లు ఎందుకు?
దాడి కేసులో నిందితుడు వైసీపీ అభిమాని అను రెండు గంటల్లోనే డీజీపీ ఆర్పీ ఠాకూర్ సర్టిఫికేట్ ఇచ్చారని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ చంద్రబాబు, డీజీపీ ఠాకూర్‌ది కాదని నివేదిక ఇవ్వగలరా అని బుగ్గన ప్రశ్నించారు. జగన్ పైన దాడి జరిగితే ఒక్క టీడీపీ నేత పరామర్శించలేదన్నారు. విమానాశ్రయాలతో రాష్ట్ర పోలీసులకు ఏమాత్రం సంబంధం లేకుంటే పోలీస్ స్టేషన్లు ఎందుకన్నారు.

ఆ లేఖపేజీ పేజీకి సంబంధమే లేదు
పోలీసులు విడుదల చేసిన లేఖ పేజీ, పేజీకి సంబంధమే లేకుండా ఉందని బుగ్గన అన్నారు. ఫ్లెక్సీలో గరుడ బొమ్మను ఏర్పాటు చేశారని, దానిని సరిగ్గా డిజైన్ చేయడం కూడా టీడీపీ నేతలకు రాలేదన్నారు. జగన్ చేతిలోకి కత్తి లోతుగా వెళ్లడంతో కండకు తొలుత వైద్యులు కుట్లు వేశారని, అనంతరం చర్మానికి కుట్లు వేశారని చెప్పారు. ఈ దాడిని ఖండించాల్సిన టీడీపీ నేతలు, దారుణంగా మాట్లాడుతున్నారన్నారు.












Click it and Unblock the Notifications