విశాఖ ఎయిర్‌పోర్టులో వైయస్ జగన్‌పై కత్తితో దాడి: రక్తంతో తడిసిన షర్ట్, రోజా వార్నింగ్, కంటతడి
Recommended Video

విశాఖపట్నం: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై దాడి జరిగింది. విశాఖపట్నం విమానాశ్రయంలో లాంజ్‌లో కూర్చుని ఉండగా శ్రీనివాస్ అనే వెయిటర్.. కత్తి దాడి చేశాడు.
నిందితుడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
వెంటనే అప్రమత్తమైన ఎయిర్‌పోర్టు సిబ్బంది వెయిటర్ శ్రీనివాస్‌ను పోలీసులకు అప్పగించారు. అతడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. స్థానికంగా ఉన్న క్యాంటీన్‌లో వెయిటర్‌గా పనిచేస్తున్నట్లు తెలిసింది.

సెల్ఫీ తీసుకుంటానని వచ్చి..
జగన్మోహన్ రెడ్డితో సెల్ఫీ దిగుతానంటూ వచ్చిన వెయిటర్ శ్రీనివాస్.. ఆయనపై కత్తితో దాడి చేశాడు. కోళ్ల పందేళ్లో ఉపయోగించే కత్తిని దాడికి వాడినట్లు తెలుస్తోంది. కాగా, శ్రీనివాస్‌ది తూర్పుగోదావరి జిల్లా ముమ్మడివరంగా గుర్తించారు.

రక్తపు గాయంతోనే హైదరాబాద్‌కు జగన్
విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. కాగా, వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఈ దాడిలో ఎడమ భుజానికి గాయమైంది. రక్తంతో జగన్ షర్టు కొంత భాగం తడిసిపోయింది. వెంటనే ఆయనకు వైద్యులు చికిత్స అందించారు. అనంతరం ఆయన హైదరాబాద్‌కు బయల్దేరారు.

ప్రతిపక్ష నేతకే రక్షణ లేదా?
సెల్ఫీ తీసుకుంటానంటూ వచ్చి ఈ దాడికి పాల్పడటం దారుణమని వైసీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు. సీఎం చంద్రబాబు ఈ ఘటనలో నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. గతంలో కూడా విశాఖ ఎయిర్ పోర్టులో జగన్ పై దాడి జరిగిందని తెలిపారు.ప్రతిపక్ష నేతకే రక్షణ లేకుంటే సామాన్య ప్రజలకు ఏం రక్షణ కల్పిస్తారని ప్రభుత్వంపై రోజా మండిపడ్డారు.

కత్తి విషయం పూశారా?
జగన్‌పైనే హత్యాయత్నం చేశాడంటే అలాంటి వదిలిపెట్టొద్దని రోజా అన్నారు. సెక్యూరిటీ ఉండగానే ఈ దాడి జరగడం ఏంటని ప్రశ్నించారు. ఓ వ్యక్తి కత్తితో తిరుగుతున్నా ఇలాంటి దాడి జరగడం దేనికి సంకేతమని నిలదీశారు.
కోళ్ల పందేలాకు ఉపయోగించే కత్తి దాడి చేశారని రోజా అన్నారు. దానికి విషం ఏమైనా పూశారా? అనేది తేలాల్సి ఉందని అన్నారు.

రోజా వార్నింగ్
జగన్మోహన్ రెడ్డికి ఏమైనా జరిగితే మాత్రం ఊరుకునేది లేదంటే చంద్రబాబు ప్రభుత్వానికి రోజా తీవ్రంగా హెచ్చరించారు. దాడి చేసిన నిందితుడ్ని, అతని వెనుకాల ఉన్న వారిని అరెస్ట్ చేసి చర్యలు తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామన్నారు.

రోజా కంటతడి
హైదరాబాద్ వెళ్లిన తర్వాత జగన్ వైద్యం చేయించుకుంటారని రోజా తెలిపారు. నిందితుడు ఉపయోగించిన కత్తికి విషం ఏమైనా పూశారా? అనే తేలుతుందన్నారు. వైయస్ లానే జగన్‌కు కూడా జనం అంటే పిచ్చి అని రోజా చెప్పారు. జగన్‌పై కుట్రపూరితంగానే దాడి జరిగిందని రోజా కన్నీటి పర్యాంతమయ్యారు.
-
జగన్ కు జనాలిచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా సరిపోలేదేమో..మంత్రి లోకేష్ సెటైర్లు -
విశాఖలో వాహనదారులకు హెచ్చరిక .. ఆ పని చేస్తే ఇక కష్టమే -
విశాఖ-ఢిల్లీ ఇండిగో ఫ్లైట్ లో తీవ్ర సాంకేతిక లోపం -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు












Click it and Unblock the Notifications