షాక్: వైఎస్ అనుచరుడు సూరీడుపై హత్యాయత్నం -క్రికెట్ బ్యాట్‌తో చావబాదిన అల్లుడు - కూతురు ఫిర్యాదుతో
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తండ్రి, ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్య అనుచరుడు సూరీడుపై హత్యాయత్నం కలకలం రేపింది. హైదరాబాద్‌లోని సొంత ఇంట్లోనే సూరీడుపై దాడి జరిగింది. ఈ ఘటనకు సంబంధించి సూరీడు కూతురి ఫిర్యాదు మేరకు జూబ్లీ హిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం..
వైఎస్ అనుచరుడు సూరీడుపై హైదరాబాద్ లో దాడి జరిగింది. జూబ్లీహిల్స్‌లోని ఆయన ఇంట్లోకి బలవంతంగా ప్రవేశించిన అల్లుడు డాక్టర్ సురేంద్రనాథ్.. క్రికెట్ బ్యాట్‌తో సూరీడుపై హత్యాయత్నానికి పాల్పడ్డాడు. సూరీడు కుమార్తె గంగా భవానీకి సురేంద్రనాథ్ తో కొన్నాళ్ల కిందట పెళ్లి జరగ్గా, దంపతుల మధ్య గొడవలు జరిగి దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో..

తన భర్త డాక్టర్ సురేంద్రనాథ్ వేధింపులకు పాల్పడుతున్నాడంటూ గంగా భవాని చాలా కాలం కిందటే పుట్టింటికి వచ్చేశారు. భర్తపై గృహ హింస కేసు కూడా పెట్టారు. సదరు కేసులను వెనక్కి తీసుకోవాలంటూ సురేంద్రనాథ్ కొంతకాలంగా భార్య భవానీ, మామ సూరీడుపై ఒత్తిడి తీసుకొస్తున్నాడు. కానీ అందుకు వారు నిరాకరిస్తూ వచ్చారు. దీంతో..
భార్య, మామలపై కక్ష పెంచుకున్న సురేంద్రనాథ్ ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి గంగా భవాని ఫిర్యాదు మేరకు హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. కాగా,గతేడాది కూడా ఆయన దాడికి పాల్పడగా సూరీడు తప్పించుకున్నాడు. దీంతో బరితెగించిన సురేంద్రనాథ్ ఏకంగా ఇంటికే వచ్చి దాడి చేయడం కలకలం రేపుతోంది. వైఎస్ మరణం తర్వాత దాదాపు తెరమరుగైన సూరీడు.. కొద్ది రోజుల కిందట తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి సభలో వేదికపైకొచ్చి అందరినీ ఆశ్చర్యపర్చారు.












Click it and Unblock the Notifications