ఏపీలో లొల్లి షురూ.. చంద్రగిరిలో టీడీపీ వైసీపీ ఏజెంట్ల పరస్పర దాడి
Recommended Video
ఏపీలో చంద్రగిరి ఎన్నికల ఫలితాలపై ఏపీ ప్రజలలో ప్రత్యేక ఆసక్తి నెలకొంది. చంద్రగిరి లో పోలింగ్ జరగటం అనతరం రీ పోలింగ్ విషయంలో జరిగిన రగడ నేపధ్యంలో చంద్రగిరిలో కౌంటింగ్ సజావుగా నిర్వహించటం కోసం భారీ భద్రత ఏర్పాటు చేశారు. అయినప్పటికీ చంద్రగిరిలో లొల్లి షురూ అయ్యింది. నువ్వా నేనా అన్నట్టు ఎన్నికల్లో తలపడిన టీడీపీ , వైసీపీ పక్షాలు , ఓట్ల లెక్కింపు విషయంలోనూ తగవులకు దిగుతున్నాయి. ఘర్షణలకు కాలు దువ్వుతున్నాయి.
చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో కౌంటింగ్ సందర్భంగా మళ్లీ అలజడి నెలకొంది. చంద్రగిరి కౌంటింగ్ కేంద్రం వద్ద టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఏజెంట్లు దాడులకు దిగారు. చంద్రగిరి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, టీడీపీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది.

చివరకు ఆయా పార్టీల అభ్యర్థులు ధర్నాలకు దిగిన పరిస్థితి కూడా నెలకొంది. ఇకపోతే రీ పోలింగ్ విషయంలోనూ తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల తూటాలు పేలాయి. ఇప్పుడు తాజాగా కౌంటింగ్ ఆరంభంలోనే దాడులకు దిగి వాతావరణాన్ని ఉద్రిక్తంగా మారుస్తున్నారు .












Click it and Unblock the Notifications