సీఎం జగన్ క్యాంపు కార్యాలయం సమీపంలో పురుగుల మందు తాగి మహిళ ఆత్మహత్యా యత్నం

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి క్యాంప్ కార్యాలయం వద్ద ఒక మహిళ ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. సీఎం జగన్ ని ఎలాగైనా కలవాలని పోలీసులను కోరిన ఆమె, సీఎం జగన్ ని కలవడానికి వీలు లేదని వారు చెప్పడంతో తన వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. ఒక మహిళ సీఎం క్యాంప్ ఆఫీస్ దగ్గర ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించడంతో ఒక్కసారిగా షాక్ తిన్న పోలీసులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు ఆ మహిళకు చికిత్స అందిస్తున్నారు.

ఇక అసలు విషయానికి వస్తే నెల్లూరు జిల్లా చిట్టమూరు మండలం చిల్లమూరు గ్రామానికి చెందిన ఒక కుటుంబం సీఎం జగన్ మోహన్ రెడ్డిని కలవాలని క్యాంప్ ఆఫీసుకు వచ్చారు. నెల్లూరు జిల్లా దుత్తలూరు తహసిల్దార్ తమని మోసం చేశారని నాగార్జున ,భవాని దంపతులు, తమ ఇద్దరు పిల్లలతో కలిసి సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లి జగన్మోహన్ రెడ్డికి విన్నవించుకోవాలని ఆయన మాత్రమే తమ కుటుంబానికి న్యాయం చేస్తారని భావించారు .

Attempted suicide by a woman after consuming insecticide near the CM Jagan camp office

నెల్లూరు నుండి తాడేపల్లికి కుటుంబంతో సహా వచ్చిన నాగార్జున దంపతులు సీఎం జగన్ ఇంటికి వెళ్లే చెక్ పోస్ట్ వరకు చేరుకుని, సీఎం జగన్ ను ఎలాగైనా కలవాలని పోలీసులను కోరారు. ఎంతగానో ప్రాధేయపడ్డారు. వీలు కాదు అని చెప్పడంతో నాగార్జున భార్య భవాని పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. సీఎం క్యాంపు కార్యాలయం అధికారులు ఈ ఘటనపై ఆరా తీస్తున్నారు. సదరు మహిళ కుటుంబానికి జరిగిన అన్యాయం ఏమిటనే దానిపై విచారిస్తున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి వాకబు చేస్తున్నారు .

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+