జాతీయ వివాదంగా బాబు టేపు: రాష్ట్రపతితో జగన్..!

అమరావతి: ఓటుకు నోటు వ్యవహారంలో ఏపీ సీఏం చంద్రబాబును ఏ-1 ముద్దాయిగా చేర్చాలని కోరుతూ గవర్నర్‌ నరసింహాన్‌‌కు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఇప్పటికే వినతి పత్రం ఇచ్చిన సంగతి తెలిసిందే.

ఓటుకు నోటు వ్యవహారంలో ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు, ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో మాట్లాడిన టేపులను విడుదల చేసింది. తాజాగా ఈ వ్యవాహారాన్ని జాతీయ స్ధాయి నాయకుల వద్దకు తీసుకెళ్లి పెద్ద వివాదంగా మార్చాలని వైయస్ జగన్ ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

Audio tape row: ys jagan may complaint babu issue on national level leaders

ఈ ఆడియో టేపు సంభాషణలతో వైయస్ జగన్ మరింత దూకుడుగా ముందుకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, పార్టీ నాయకులు ఢిల్లీకి వెళ్లి మంగళవారం రాష్ట్రపతిని కలవనున్నారు. బుధవారం కేంద్ర హోంమంత్రి రాజనాథ్ సింగ్ తో భేటీ కానున్నారు.

కాగా, ఓటుకు నోటు వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏపీ సీఎం చంద్రబాబు నైతిక బాధ్యతగా సీఎం పదవికి రాజీనామా చేయాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. చంద్రబాబు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఏపీలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలు నిర్వహించనున్నట్టు తెలిపింది.

ఏపీలో జరుగుతోన్న రాజకీయ పరిణామాలపై కేంద్రాన్ని కలిసేందుకు తెలంగాణ సీఎం, గవర్నర్ నరసింహాన్, ఏపీ సీఏం చంద్రబాబు త్వరలో ఢిల్లీకి వెళ్లనున్నారు. గవర్నర్ నరసింహన్ ఈ నెల 9వ తేదీన ఢిల్లీకి వెళ్తున్నారు. ఆయన 10, 11, 12 తేదీల్లో ఢిల్లీలో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.

రేవంత్ వ్యవహారం, ఫోన్ ట్యాపింగ్ పైన కేంద్రం ఆరా తీస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో గవర్నర్ రేవంత్ వ్యవహారం విషయంలో కేంద్రానికి నివేదికలు ఇచ్చే అవకాశముందని తెలుస్తోంది. అదే 9వ తేదీన చంద్రబాబు ఢిల్లీ వెళ్తున్నారు. ఆయన ఫోన్ ట్యాపింగ్ పైన కేంద్రానికి ఫిర్యాదు చేయవచ్చుని తెలుస్తోంది.

జూన్ 10న చైనా ప్రతినిధులతో చంద్రబాబు భేటీ కావాల్సి ఉందని, దానికోసమే ఢిల్లీకి వెళ్తున్నారని ఏపీ సచివాలయ అధికారులు చెబుతున్నారు. చైనా ప్రతినిధులతో భేటీ ఉన్నప్పటికీ తెలంగాణ ప్రభుత్వం వ్యవహారాన్ని కేంద్రం దృష్టికి చంద్రబాబు తీసుకు వెళ్తారని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+