యువతిపై మిత్రులతో కలిసి ఆటో డ్రైవర్ గ్యాంగ్ రేప్
విజయవాడ: స్వాతంత్ర్య దినోత్సవం నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా గుడివాడలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. గుడివాడలో ఓ యువతిపై ముగ్గురు యువకులు అత్యాచారం చేశారు. యువతి గుడివాడలోని పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందుతుల కోసం గాలిస్తున్నారు.
ఆటోలో ప్రయాణిస్తున్న యువతిపై ఆటో డ్రైవర్ తన ఇద్దరు స్నేహితులతో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో పోలీసులు ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. యువతిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి పంపించారు.

తుంగభద్రలో పడి వ్యక్తి మృతి
మద్యం మత్తులో తుంగభద్ర నదిని దాటుతూ ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు మరణించాడు. శనివారం కర్నూలు జిల్లా మంత్రాలయం వద్ద ఈ ఘటన జరిగింది. మంత్రాలయానికి చెందిన గురురాజు (40) శనివారం ఉదయం సరిహద్దు కర్ణాటకలోని పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లి పూజలు చేసి తిరుగు ప్రయాణంలో తుంగభద్ర నదిని దాటబోయాడు.
అతను తుంగభద్ర నదిని దాటుతూ నీటిలో పడిపోయాడు. తోటి ప్రయాణికులు కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. గురురాజు మద్యం మత్తులో ఉన్నాడని వారు తెలిపారు. విషయం తెలిసిన పోలీసులు మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టారు.












Click it and Unblock the Notifications