మహిళకు మత్తిచ్చి దోపిడీ: భార్యాబిడ్డలపై కత్తితో దాడి

దాంతో మహిళ స్పృహ కోల్పోయింది. ఆమె వద్ద ఉన్న లక్ష రూపాయలు అపహరించి అతను ఉడాయించాడు. ఆమెను అక్కడే వదిలేసి అతను పారిపోయాడు. స్థానికులు మహిళను నిజామాబాద్ ఆస్పత్రికి తరలించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లా పుట్టపర్తిలో ఓ ఆర్ఎంపి వైద్యుడు ఘాతుక చర్యకు పాల్పడ్డాడు. భార్యపై, రెండేళ్ల కూతురిపై అతను కత్తితో దాడి చేశాడు. దీంతో వారిద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన ఇద్దరని స్థానికులు ఆస్పత్రికి తరలించారు.
శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం
హైదరాబాదులోని శంషాబాద్ విమానాశ్రయంలో బుధవారం ఉదయం అక్రమంగా తరలిస్తున్న కిలో బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. దుబాయ్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి వద్ద కిలో బంగారం ఉన్నట్లు గుర్తించిన అధికారులు దాన్ని స్వాధీనం చేసుకున్నారు.
మూడు ఇళ్లలో చోరీ..
హైదరాబాద్ నగరంలోని బోడుప్పల్‌లో దుండగులు రెచ్చిపోయారు. గత రాత్రి మూడు ఇళ్లలో చోరీలకు పాల్పడిన దుండగులు ఐదు తులాల బంగారం, 20 తులాల వెండి, రూ.50 వేల నగదును అపహరించారు. దొంగతానికి యత్నించిన దుండగుల్లో ఒకరిని స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.












Click it and Unblock the Notifications