జగన్ కోసం సోదరుడు పూచీకత్తు, ఇంటి వద్ద సందడి

దీనిని కోర్టు పరిశీలించిన అనంతరం జగన్ విడుదల ఆర్డర్‌ను చంచల్‌గూడ జైలు అధికారులకు పంపించనుంది. ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటల తర్వాత జగన్ విడుదలయ్యే అవకాశముంది. మధ్యాహ్నం జగన్ విడుదల నేపథ్యంలో చంచల్ గూడ జైలు వద్దకు భారీగా కార్యకర్తలు, అభిమానులు తరలి వస్తున్నారు.
దీంతో పోలీసులు జైలు వద్ద మూడంచెల భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఒక కంపెనీ బిఎస్ఎఫ్, మూడు ప్లటూన్ల ఎపిఎస్పీతో పాటు పలు పోలీసు స్టేషన్లకు సంబంధించిన పోలీసులను మోహరించారు. ముళ్లకంచెలు, బారీకేడ్లు ఏర్పాటు చేశారు. నాంపల్లి వద్ద పూచీకత్తు సమర్పించేందుకు నాయకులు వచ్చినప్పుడు కూడా కార్యకర్తలు అక్కడకు తరలి వచ్చారు.
భారీ ర్యాలీతో లోటస్‌పాండుకు జగన్
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి 16 నెలల అనంతరం చంచల్‌గూడ జైలు నుండి విడుదలవుతున్న నేపథ్యంలో ఆయనను భారీ ర్యాలీతో పార్టీ కేంద్ర కార్యాలయానికి తీసుకు వెళ్లాలని నేతలు భావిస్తున్నారు.
ఇంటి వద్ద సందడి
జగన్ రాక కోసం లోటస్ పాండు వద్ద సందడి కనిపిస్తోంది. అక్కడ పండుగ వాతావరణం కనిపిస్తోంది. జగన్ బెయిల్ పైన విజయమ్మ స్పందిస్తూ... జగన్‌కు బెయిల్ రావడం సంతోషంగా ఉందని, నాలుగేళ్లలో ఇదే సంతోషకరమైన మాట వినడం ఇదే తొలిసారి అని, తమ ఇంట్లో పండుగ వాతావరణం కనిపిస్తోందని అన్నారు. అప్పుడు సిబిఐని పొగిడిన వారు ఇప్పుడు విమర్శలు చేస్తున్నారని, దీనిని ప్రజలు గమనిస్తున్నారన్నారు. జగన్‌కు ఇష్టమైనవన్నీ వండిపెడతానని చెప్పారు.












Click it and Unblock the Notifications