కన్నులపండుగగా అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ట: భక్తిపారవశ్యంలో ఏపీ; జిల్లాల వారీగా సంబరాలిలా!!

అయోధ్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ట పురస్కరించుకొని ఏపీలోని అన్ని జిల్లాలలో కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. నగర సంకీర్తనలు, భజనలు, ప్రసాద వితరణ కార్యక్రమాలు జోరుగా కొనసాగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆలయాలలో విశేష కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయోధ్య రామయ్య విగ్రహ ప్రాణ ప్రతిష్టను రాష్ట్రవ్యాప్తంగా ఒక పండుగలా ఘనంగా జరుపుకుంటున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా బాల రాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా భక్తులు వీక్షించే విధంగా దేవాలయాలలో పెద్దపెద్ద ఎల్ఈడి తెరలను ఏర్పాటు చేశారు. ప్రకాశం జిల్లాలోని పలు ఆలయాలలో సీతారాముల కల్యాణములు ప్రత్యేక యాగాలు హోమాలు చేస్తున్నారు.ఒంగోలు నగరంలోని సంతపెట ఆంజనేయ స్వామి దేవాలయంలో సీతా రాముల కళ్యాణం నిర్వహించారు.

 Ayodhya Ram Pran pratishta; celebrations with full devotion in AP districts!!

గాంధీ రోడ్డు లోని కొదండరామస్వామి దేవాలయం, సీతారామ పురం లోని రామాలయం, లాయర్ పేట లోని చిట్టి ఆంజనేయ స్వామి దేవాలయంలో జగదభి రాముని కళ్యణోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఒంగోలు నగరం లోని సాయి సరోజ్ మయూరి సినిమా హాల్ లో బాల రాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా భక్తులు వీక్షించే ఏర్పాటు చేశారు.

అనంతపురం జిల్లాలో ధర్మవరం పట్టణంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి భక్తులు హనుమంతుడి జెండాలతో భక్తి గీతాలను ఆలోచిస్తూ నగర సంకీర్తన చేశారు. ప్రధాన వీధుల గుండా శ్రీరామ జయ రామ, జయజయ రామ అని పాటలు పాడుకుంటూ ర్యాలీ నిర్వహించారు. అంతేకాదు చిత్తూరులో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో అయోధ్యలో బాలరాముడి ప్రతిష్ట సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు. జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు.

ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామి మఠంలో పీఠాధిపతులు శ్రీ సుభుదేంద్ర తీర్థుల ఆధ్వర్యంలో నేడు శ్రీరాముని ప్రభోత్సవం కన్నుల పండుగగా జరిగింది. భక్తులు జై శ్రీరామ్ నినాదాలతో శ్రీ రాఘవేంద్రస్వామి మఠం మార్మోగింది. అయోధ్య రామ మందిరం లో శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠ పర్వదిన సందర్భంగా మద్దత్తుగా పెద్దాపురం లో వేలాది సంఖ్యలో చేరుకుని ప్రధాన రహదారుల మీదుగా భారీ ప్రదర్శన నిర్వహించారు.

జై శ్రీరామ్ అంటూ లయబద్దంగా వృద్ధులు, మధ్యతరం, యువత, చిన్నారులు ఇలా వయోభేదం లేకుండా మొదటిసారిగా రోడ్ పైకి వచ్చి ప్రదర్శనలు చేయడం విశేషం. అల్లూరి సీతారామరాజు జిల్లా కె. గంగవరం మండలంలో శ్రీరాముని శోభయాత్ర ఘనంగా జరుగుతుంది. శ్రీరామ జయరామ జయజయరామ అంటూ విజయనగరం జిల్లా చీపురుపల్లిలో ఉదయం నుంచి రామ మందిరాల్లో భజన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. పలుచోట్ల అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

మరోవైపు శ్రీకాకుళం జిల్లా పాలకొండ లో అయోధ్య రాముని శోభాయాత్ర నిర్వహించారు. కృష్ణాజిల్లాలోనూ గ్రామ గ్రామాన శ్రీరామ శోభాయాత్రలు కొనసాగుతున్నాయి. శ్రీరామ నామస్మరణతో రాముల వారి ఊరేగింపు మహోత్సవం గుంటూరు జిల్లాలోనూ, తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలలోనూ , విశాఖపట్నంలోనూ అట్టహాసంగా కొనసాగుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+