Ayodhya verdict : అయోధ్య తీర్పు సందర్భంగా చంద్రబాబు విజ్ఞప్తి
Recommended Video
అయోధ్య భూ వివాదంపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తుది తీర్పు కొద్ది క్షణాల్లో వెల్లడించనున్నది. శనివారం (నవంబర్9వ తేదీన) ఉదయం 10.30 నిమిషాలకు జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం తీర్పును వెల్లడించనున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. నేడు జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని జస్టిస్ ఎస్ఏ బోబ్డే, డీవై చంద్రచూడ్, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎస్ఏ నజీర్ లు అయోధ్య వివాదం పై తుది తీర్పును వెల్లడించనున్నారు .
ఎలాంటి ఉద్రిక్తతలకు చోటు లేకుండా శాంతియుత వాతావరణంలో కోర్టు ఇచ్చే తీర్పును అందరు స్వాగతించాలని ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడి పిలుపునిచ్చారు. సుప్రీం కోర్టు తీర్పు అనంతరం కూడా మైత్రి, సయోధ్యలను మనం చక్కగా కాపాడుకోవాలని మోడీ కోరారు.

ఇక ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువడనున్న నేపథ్యంలో చాలా సున్నితమైన ఈ కేసుపై స్పందించారు. 'అయోధ్య విషయమై తీర్పు వెలువడబోతున్న సందర్భంగా ప్రజలందరికీ నా విజ్ఞప్తి ఒక్కటే. తీర్పు ఎవరికి అనుకూలంగా వచ్చినా అందరం హృదయపూర్వకంగా ఆ తీర్పును స్వీకరించాలి. సంయమనం పాటించాలి, మత సామరస్యం కాపాడాలి. శాంతి, సౌభాతృత్వంతో సమసమాజ నిర్మాణమే మన అంతిమలక్ష్యం కావాలి' అని చంద్రబాబు ట్వీట్ చేశారు.
అయోధ్య విషయమై తీర్పు వెలువడబోతున్న సందర్భంలో ప్రజలందరికీ నా విజ్ఞప్తి ఒక్కటే. తీర్పు ఎవరికి అనుకూలంగా వచ్చినా అందరం హృదయపూర్వకంగా ఆ తీర్పును స్వీకరించాలి. సంయమనం పాటించాలి, మత సామరస్యం కాపాడాలి. శాంతి, సౌభాతృత్వంతో సమసమాజ నిర్మాణమే మన అంతిమలక్ష్యం కావాలి.#AYODHYAVERDICT
— N Chandrababu Naidu (@ncbn) November 9, 2019
పార్టీలు వేరైనా అందరు రాజకీయ నేతలు శాంతి సౌభ్రాతృత్వాలు వెల్లివిరియాలని కోరుకుంటున్న పరిస్థితి తాజా అయోధ్య తీర్పు నేపథ్యంలో ప్రధానంగా కనిపిస్తుంది. ఇప్పటికే చాలామంది ప్రముఖులు ప్రజలందరూ శాంతియుతంగా, సామరస్యపూర్వకంగా ఉండాలని, తీర్పు ఎలా వచ్చినా దానిని స్వీకరించేందుకు అందరూ సన్నద్ధంగా ఉండాలని పేర్కొంటున్న పరిస్థితి కనిపిస్తుంది.












Click it and Unblock the Notifications