మనుషులా? పశువులా?: భూదందాపై కడిగేసిన అయ్యన్న!, కంగు తిన్న మంత్రులు..
ఆర్&బీ సీఈకి రూ.140కోట్ల అక్రమ ఆస్తులా?, ఓ తహశీల్దార్ కు రూ.40కోట్ల అక్రమ సంపాదనా? అని అయ్యన్నపాత్రుడు ప్రశ్నించారు.
విజయవాడ: విశాఖ భూదందాలపై ఏపీ మంత్రి అయ్యన్నపాత్రుడు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. నవ నిర్మాణ దీక్షలో పాల్గొన్న ఆయన భూదందా అంశాన్ని లేవనెత్తారు. బయటి నుంచి వచ్చి కొందరు వ్యక్తులు విశాఖలో భూ దందాలకు తెరలేపారని ఆరోపించారు.
భూదందాల్లో ప్రమేయం ఉన్నవాళ్లకు రాజకీయ నాయకులతోను, అధికారులతోను సంబంధాలున్నట్లుగా పరోక్ష ఆరోపణలు చేశారు. వారు వత్తాసు పలకడం వల్లే భూదందా మరింత జోరుగా జరుగుతోందన్నారు. భూదందాను అరికట్టేందుకు కలెక్టర్, జేసీ, సీపీ కృషి చేస్తున్నారని చెప్పారు. కలెక్టర్, జేసీ, సీపీకి సహకరించేందుకు తాను సిద్దంగా ఉన్నాని అన్నారు.

ఇన్ని ఆస్తులా?:
భూదందా వ్యవహారాల్లో విచారణకు ప్రజలు, అధికారులు ప్రభుత్వానికి సహకరించాలన్నారు. భూదందాలతో కోట్లు గడిస్తున్న అధికారులపై అయ్యన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్&బీ సీఈకి రూ.140కోట్ల అక్రమ ఆస్తులా?, ఓ తహశీల్దార్ కు రూ.40కోట్ల అక్రమ సంపాదనా? అని ప్రశ్నించారు.

ఎమ్మెల్యేలు,మంత్రులు షాక్:
మంత్రి అయ్యన్నపాత్రుడి మాటలకు పక్కనే ఉన్న ఇతర ఎమ్మెల్యేలు, మంత్రులు షాక్ తిన్నారు. అయ్యన్న చేసిన వ్యాఖ్యలను ఆశ్చర్యంగా చూస్తుండిపోయారు. కష్టపడి సంపాదించుకున్న డబ్బుతో సామాన్యులు భూములు కొనుక్కుంటే.. వాటిని కబ్జా చేస్తున్నారని, అసలు వాళ్లు మనుషులా? పశువులా? అంటూ అయ్యన్న కడిగిపారేశారు.

దందాలో రాజకీయ నాయకులే:
రాజకీయ నాయకులే భూదందాలకు పాల్పడుతున్నారని రెండు రోజుల క్రితం అయ్యన్నపాత్రుడు తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఐదారు వేల ఎకరాలు కబ్జాకు గురయ్యాయని చెప్పారు. భూవివాదాలు పరిష్కరించేందుకు ఓ ఐఏఎస్ అధికారిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరినట్లుగా తెలిపారు. మధురవాడలో పోలీసులే భూ సెటిల్మెంట్లు చేస్తున్నారని అయ్యన్న ఆరోపించారు.

పబ్లిక్ హియరింగ్:
అయ్యన్నపాత్రుడి ఆరోపణల నేపథ్యంలో విశాఖలో భూదందాపై బహిరంగ విచారణ జరిపిస్తామని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి ప్రకటించిన సంగతి తెలిసిందే. విశాఖ జిల్లాలోని భూ రికార్డుల మార్పిడిని పరిశీలించి సమస్యలు పరిష్కరిస్తామన్నారు. బాధితుల నుంచి నుంచి వివరాలు తెలుసుకునేందుకు పబ్లిక్ హియరింగ్ చేపట్టాలని నిర్ణయించినట్లు ఆ సందర్భంగా పేర్కొన్నారు.
-
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!!












Click it and Unblock the Notifications