ఎడ్లబండిపై నుంచి జారిన అయ్యన్నపాత్రుడు

Subscribe to Oneindia Telugu

విశాఖపట్నం: జిల్లాలో ఆదివారం జరిగిన జనచైతన్య యాత్రలో మంత్రి అయ్యన్నపాత్రుడు ఎడ్ల బండిపై నుంచి జారి పడబోయారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆయన కింద పడిపోకుండా పట్టుకున్నారు. అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని తుమ్మపాల పంచాయతీలో నిర్వహించిన తెలుగుదేశం పార్టీ జనచైతన్య యాత్రలో ఈ ఘటన జరిగింది. యాత్రలో డప్పుల చప్పుడుకు గిత్తల బెదరడంతో ఎడ్లబండి అదుపుతప్పింది. దీంతో ఒక్కసారిగా బండి కిందకు ఒరిగింది. వెంటనే మంత్రి పక్కేనే ఉన్న, నాయకులు, కార్కకర్తలు భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఈ ఘటనలో మంత్రికి ఎటువంటి గాయాలు కాలేదు. దీంతో అందరూ ఉపిరిపీల్చుకున్నారు. అనంతరం మంత్రి పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Ayyanna Patrudu escapes from a small accident in isakhapatnam.
Please Wait while comments are loading...