గంజాయి స్మగ్లర్లు: జగన్ పార్టీ నేతలపై అయ్యన్న సంచలనం

Subscribe to Oneindia Telugu

విశాఖపట్నం: ఏపీ మంత్రి అయ్యన్నపాత్రుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర ఆరోపణలు చేశారు. గంజాయి రవాణాలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలే ఎక్కువ సంఖ్యలో ఉన్నారని అన్నారు.

విశాఖపట్నం జిల్లాలోని ఏటిగైరంపేట నుంచి పాకలపాడు మీదుగా తుని, వడ్డాది, బుచ్చయ్యపేటల మీదుగా గంజాయి రవాణా జరుగుతున్నట్లు వివరించారు. పీడీ యాక్టు ప్రయోగిస్తేనే గంజాయి రవాణా నియంత్రణ సాధ్యమవుతుందని అన్నారు.

ayyanna patrudu fires at YSRCP leaders in ganja supply issue

గంజాయి రవాణా జరుగుతున్న విషయం అన్ని విభాగాలకు తెలుసని, ముఖ్యంగా పోలీసులు, ఎక్సైజ్ శాఖ అధికారులకు కూడా తెలుసని అయ్యన్నపాత్రుడు ఇటీవల వ్యాఖ్యానించారు. అంతేగాక, గంజాయి రవాణాకు సహకరిస్తున్న పెద్దలపైనా పీడీ యాక్ట్ అమలు చేస్తే సమస్యకు పరిష్కారం లభిస్తుందని అన్నారు.

ఏపీ సంతోషం కోసమే..

సమస్యలు లేని సంతోష ఆంధ్రప్రదేశ్‌ను చేయడమే సీఎం చంద్రబాబు లక్ష్యమని ఎంపీ కేశినేని నాని అన్నారు. పాదయాత్ర ద్వారా ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కరించడమే ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమం ఉద్దేశమన్నారు. విజయవాడ రూరల్ గొల్లపూడి గ్రామంలో ఎంపీ కేశినేని నాని, మంత్రి దేవినేని ఉమ ఇంటింటికీ తెలుగు దేశం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి దేవినేని, ఎంపీ కేశినేని ఇంటింటికీ తిరుగుతూ ప్రజల సమస్యలను తెలుసుకున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Andhra Pradesh minister Ayyanna Patrudu fired at YSRCP leaders in ganja supply issue.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X