విజయసాయి అప్రూవర్ గా మారి జగన్ గుట్లన్నీ బయటపెడతారా.. అయ్యన్నపాత్రుడు ఆసక్తికర వ్యాఖ్యలు

టిడిపి సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడువైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి పై సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పించారు. ప్రతి విషయంలోనూ విజయసాయిరెడ్డి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారని అందరికీ తెలిసిన విషయమే. ఇక ఈ నేపథ్యంలో విజయసాయి రెడ్డిపై గత కొంత కాలంగా అయ్యన్న పాత్రుడి రివర్స్ ఎటాక్ కొనసాగుతుంది .

జగన్ జడ్జీలపై రాసిన లేఖపై కిక్కురుమనరేం : విజయసాయికి అయ్యన్న ప్రశ్న

జగన్ జడ్జీలపై రాసిన లేఖపై కిక్కురుమనరేం : విజయసాయికి అయ్యన్న ప్రశ్న

విజయసాయి రెడ్డిపై తాజాగా సెటైర్లు వేసిన అయ్యన్నపాత్రుడు ఈ ప్రపంచంలో ప్రతి విషయంపైనా ట్విట్టర్లో ఎగిరి దూకే విజయసాయిరెడ్డి జడ్జిల విషయంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి రాసిన లేఖ పై కిక్కురుమనటం లేదు ఎందుకు అంటూ ప్రశ్నించారు. జడ్జీలపై రాసిన లేఖ పై వ్యాఖ్యలు చేస్తే బెయిల్ రద్దు అవుతుందని భయమా? లేక అప్రూవర్ గా మారిపోయి అసలు గుట్లన్నీ బయటపెట్టేద్దామనా ? అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

సీఎం జగన్ గుట్టు బయటపెట్టాలని విజయసాయి కుట్రపన్నుతున్నారని , సీఎం జగన్ విషయం లో విజయసాయి రెడ్డిని టార్గెట్ చేస్తూ అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి .

వరదలకు అమరావతిలో చెంబెడు నీళ్ళు కూడా నిలబడలేదన్న అయ్యన్న

వరదలకు అమరావతిలో చెంబెడు నీళ్ళు కూడా నిలబడలేదన్న అయ్యన్న

అంతేకాదు రాజధాని అమరావతి విషయంలో కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అయ్యన్నపాత్రుడు. అమరావతి మునిగిపోతుందని వైసిపి నాయకులు పెద్ద ఎత్తున ప్రచారం చేశారని భారీ వర్షాలకు మహానగరాలు వణికిపోయినా , అమరావతిలో చెంబెడు నీళ్లు కూడా నిలబడలేదని అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యానించారు . ఒకే రాష్ట్రం , ఒకే రాజధాని అంటూ అయ్యన్నపాత్రుడు రాజధాని అమరావతికి జై కొట్టారు.

ఇక ఇదే క్రమంలో సీత కన్నీరు రావణాసురుడు పతనం, ద్రౌపతి కన్నీరు కౌరవుల పతనం..అని అమరావతి మహిళల కన్నీరు వద్దు దీవెనలు తీసుకోండి అంటూ ఒక పోస్టర్ ను కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు.

Recommended Video

    Modi Jagan Meet: జగన్ ఢిల్లీ టూర్ హాట్ టాపిక్ .. 17 అంశాలపై ప్రధానమంత్రికి జగన్మోహన్ రెడ్డి నివేదన!!
    సోషల్ మీడియాలో విజయసాయి, జగన్ టార్గెట్ గా అయ్యన్న సెటైర్లు

    సోషల్ మీడియాలో విజయసాయి, జగన్ టార్గెట్ గా అయ్యన్న సెటైర్లు

    ఇక సోషల్ మీడియా వేదికగా విజయసాయి రెడ్డి ని టార్గెట్ చేసే అయ్యన్నపాత్రుడు సీఎం జగన్ మోహన్ రెడ్డిని నీ అల్లుడు, గన్నేరు పప్పు అంటూ విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. వైయస్సార్ ను మహా మేతగా అభివర్ణిస్తూ పోస్టులు పెడుతున్నారు.
    మాటకు మాట సమాధానం చెప్తున్నారు . ఇక వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఏ మాత్రం తగ్గకుండాటీడీపీ అధినేత చంద్రబాబును టార్గెట్ చేస్తూ నిత్యం పోస్టులతో హల్చల్ చేస్తున్నారు . తాజాగా చంద్రబాబు హైదరాబాద్ నుండి ఓటుకు నోటు కేసు భయంతోనే పారిపోయి కరకట్టకు వచ్చారని మాటల తూటాలు పేల్చారు .

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+