వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అంబటి అధ్యక్షతన జగన్ రెడ్డి మల్లెపూల వ్యాపారం వ్యాఖ్యలు.. అయ్యన్నకు పిచ్చి పట్టిందన్న అంబటి రాంబాబు

|
Google Oneindia TeluguNews

టిడిపి సీనియర్ నేత మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై చేసిన కామెంట్స్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో దుమారంగా మారాయి. అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు క్షమాపణ చెప్పాలంటూ వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ చంద్రబాబు నివాసాన్ని ముట్టడించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైసిపి గుండాలు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఇంటిపై దాడికి దిగారని టిడిపి నేతలు ఆరోపిస్తుంటే, వైసీపీ నేతలపై, జగన్ పై అయ్యన్న చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని వైసీపీ డిమాండ్ చేస్తుంది. అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలపై వైసిపి నేతలు నిప్పులు చెరుగుతున్నారు.

అయ్యన్న వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలన్న అంబటి రాంబాబు

అయ్యన్న వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలన్న అంబటి రాంబాబు

తాజాగా సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓటమి చవిచూసిన తర్వాత టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు నిరాశలో ఉన్నారని వైఎస్ఆర్‌సిపి అధికార ప్రతినిధి అంబటి రాంబాబు శుక్రవారం ఆరోపించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ మాజీ మంత్రి అయ్యన్న చేసిన ఘాటు వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా, అంబటి రాంబాబు అయ్యన్నపాత్రుడుకి మానసిక స్థితి బాగా లేదని పేర్కొన్నారు. కోడెల రెండవ వర్ధంతి కార్యక్రమంలో అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలను బేషరతుగా వెనక్కి తీసుకోవాలని అంబటి రాంబాబు డిమాండ్ చేశారు.

అయ్యన్న భాష మార్చుకోవాలని హితవు.. చట్టపరమైన చర్యలు తప్పవని వార్నింగ్

అయ్యన్న భాష మార్చుకోవాలని హితవు.. చట్టపరమైన చర్యలు తప్పవని వార్నింగ్

అయ్యన్నపాత్రుడు తన భాషను మార్చుకోవాల్సిన అవసరం ఉందని ధ్వజమెత్తారు. అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన అంబటి రాంబాబు, కోడెల శివప్రసాద్ మరణానికి టిడిపి, చంద్రబాబే కారణమని ఆరోపణలు గుప్పించారు. టీడీపీకి ఏపీ ప్రజలు తగిన బుద్ధి చెప్పినా ఆ పార్టీ నేతల్లో మార్పు రావడం లేదని అంబటి రాంబాబు విమర్శించారు. అధికారం పోగొట్టుకోవడం తో అవాకులు చెవాకులు పేలుతున్నారని నిప్పులు చెరిగారు.

 కోడెల వర్ధంతి సభలో అయ్యన్న హాట్ కామెంట్స్ .. మల్లె పూల వ్యాపారం చెయ్యాలంటూ

కోడెల వర్ధంతి సభలో అయ్యన్న హాట్ కామెంట్స్ .. మల్లె పూల వ్యాపారం చెయ్యాలంటూ

నిన్న కోడెల శివప్రసాద్ ద్వితీయ వర్ధంతి కార్యక్రమం సందర్భంగా గుంటూరు జిల్లా నకిరేకల్ లో మాట్లాడిన అయ్యన్నపాత్రుడు సీఎం జగన్ మోహన్ రెడ్డిని, వైసిపి నేతలను టార్గెట్ చేస్తూ సెటైర్లు వేశారు. జగన్ ను తీవ్ర పదజాలంతో దూషించారు. మాంసం, చేపలు వ్యాపారం చేయాలనుకుంటున్న ప్రభుత్వం ఎమ్మెల్యే అంబటి అధ్యక్షతన మల్లెపూల వ్యాపారం చేస్తే బాగుంటుంది అంటూ అయ్యన్నపాత్రుడు ఎద్దేవా చేశారు. జగన్ సర్కారు దిగజారిందని జగన్ కు మల్లె పూల వ్యాపారం చేయడమే మిగిలిందని విరుచుకుపడ్డారు అయ్యన్నపాత్రుడు.

Recommended Video

Ys Jagan : గాంధీ జయంతి రోజునే సంచలనం.. ఇక ప్రజల్లోనే | Ys Jagan Cares || Oneindia Telugu
చెత్తపై పన్నులేస్తున్న చెత్త నా ..... అయ్యన్న వ్యాఖ్యలు.. వైసీపీ ఆగ్రహం

చెత్తపై పన్నులేస్తున్న చెత్త నా ..... అయ్యన్న వ్యాఖ్యలు.. వైసీపీ ఆగ్రహం

అంతేకాదు పనికిమాలిన వాళ్లంతా పాలకులు అయితే రాష్ట్ర పరిస్థితి ఎలా ఉంటుందో ఏపీని చూస్తే అర్థమవుతుందని అసమర్థ పాలనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అద్దం పడుతోందని అయ్యన్న ధ్వజమెత్తారు. లక్షల కోట్ల అప్పులు చేస్తూ రాష్ట్ర భవిష్యత్తును అధోగతి పాలు చేస్తున్నారని జగన్ పై మండిపడ్డారు. చివరకు చెత్త, మరుగుదొడ్ల పై పన్ను వేస్తున్న చెత్తనా... అంటూ జగన్ ను టార్గెట్ చేస్తూ అయ్యన్నపాత్రుడు నిప్పులు చెరిగారు. ఈ క్రమంలోనే తాజాగా అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలను టార్గెట్ చేస్తూ వైసీపీ నాయకులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు.

English summary
Ayyanna patrudu satires on trade in meat and fish, should be in the business of jasmine under the chairmanship of MLA Ambati Rambabu. YSRCP spokesperson Ambati Rambabu on Friday alleged that TDP senior leader Ayyanna Patrudu was disappointed after the defeat in the last elections. In response to the harsh remarks made by Ayyanna against Chief Minister YS Jagan , Ambati Rambabu said that Ayyanna mantal condiotin is not good.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X