జిల్లాకో విమానాశ్రయమా.. భారతమ్మా! జగన్ ను ఏదైనా ఆస్పత్రిలో చూపించండి: అయ్యన్నపాత్రుడు అభ్యర్ధన
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తుగ్లక్ నిర్ణయాలు తీసుకుంటూ రాష్ట్రాన్ని మరింత అప్పుల పాలు చేస్తున్నారని మాజీమంత్రి టీడీపీ సీనియర్ నాయకుడు అయ్యన్నపాత్రుడు జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేశారు. విశాఖపట్నం జిల్లాలోని నర్సీపట్నంలో మీడియాతో మాట్లాడిన అయ్యన్న పాత్రుడు వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రతి జిల్లాకి ఒక ఎయిర్ పోర్ట్ కట్టాలి దాని కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారని పేర్కొని ఏంటండీ ఈ తుగ్లక్ నిర్ణయాలు అంటూ జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించారు.

జిల్లాకో ఎయిర్ పోర్ట్ కడతానని తుగ్లక్ నిర్ణయాలు
ఇప్పటికే రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు అంటూ మండిపడ్డారు. రాష్ట్రంలో 16 మెడికల్ కాలేజీలు 7880 కోట్లతో కొడతానని అనౌన్స్ చేసి గతేడాది మే 30 తేదీన 14 మెడికల్ కాలేజీలకు వర్చువల్ గా శంకుస్థాపన చేశారని గుర్తు చేసిన అయ్యన్నపాత్రుడు ఆ కాలేజీలు ఏమయ్యాయి అంటూ ప్రశ్నించారు.
రాష్ట్రంలో ఉద్యోగులకు సకాలంలో జీతాలు కూడా ఇవ్వకుండా, జిల్లాకు ఎయిర్ పోర్ట్ కడతానని అనడం ఎంతవరకు సమంజసమో చెప్పాలన్నారు. రిటైరైన ఎంప్లాయిస్ కు, ఆరు నెలల నుండి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వలేక పోతున్నారని అలాంటి జగన్ జిల్లాకు ఎయిర్ పోర్ట్ ఎలా కడతారు అంటూ ప్రశ్నించారు.

ప్రాజెక్ట్ లను పక్కనబెట్టి, జీతాలు, బిల్లులు ఇవ్వకుండా రాష్ట్రం నాశనం
కోట్ల రూపాయల హౌసింగ్ బిల్లులు చెల్లించలేదని, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి డబ్బులు లేవని, కరోనా సెకండ్ వేవ్ సమయంలో క్వారంటైన్ సెంటర్లలో భోజనాలు సరఫరా చేసిన కాంట్రాక్టర్లకు ఇప్పటికీ కోట్ల రూపాయల పేమెంట్లు చెల్లించలేదని, ఆఖరికి గవర్నమెంట్ స్కూల్స్ లో పిల్లలకు మధ్యాహ్న భోజనాలు పెడుతున్న కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వలేదని జగన్ తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
రాష్ట్రానికి అవసరమైన ప్రాజెక్టులను నిర్మాణం చేయకుండా, కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బిల్లులను చెల్లించకుండా జగన్ రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి వంటి ప్రాజెక్టులను పక్కనబెట్టిన ఏమిటి ఈ తుగ్లక్ నిర్ణయాలు అంటూ జగన్ సర్కార్ ను టార్గెట్ చేశారు అయ్యన్నపాత్రుడు.

ఓటిఎస్ పేరుతో పేద ప్రజల దగ్గర బలవంతపు వసూళ్లు
కరోనా మహమ్మారి కారణంగా చనిపోయిన వారి కుటుంబాలకు కూడా ఇప్పటి వరకూ పూర్తిగా పరిహారం ఇవ్వలేకపోయారు అని మండిపడ్డారు. రాష్ట్రంలో సంపదను సృష్టించడం చేతకాక ఓటిఎస్ పేరుతో పేద ప్రజల దగ్గర బలవంతపు వసూళ్లకు వైసిపి తెరతీసింది అయ్యన్నపాత్రుడు ధ్వజమెత్తారు. చివరకు చెత్త మీద, డ్రైనేజీలు మీద పన్నులు వసూలు చేస్తున్నారని జగన్ తీరుపై మండిపడ్డారు అయ్యన్నపాత్రుడు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో సమస్యలను పెండింగ్ పెట్టి జిల్లాకు ఒక ఎయిర్ పోర్ట్ కడతానని జగన్ చెప్పడానికి సిగ్గులేదా అంటూ ప్రశ్నించారు.
Recommended Video

అమ్మ భారతమ్మ జగన్ ను ఆస్పత్రిలో చూపించు
అమ్మ భారతమ్మ ఈ తుగ్లక్ నిర్ణయాలన్నీ చూస్తుంటే మీకు ఎలా ఉందో తెలియదు కానీ మాకు అయితే మీ ఆయనకి ఏదో అయిందని అనుమానంగా ఉందంటూ వైయస్ భారతి ని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. ఎందుకైనా మంచిది ఒకసారి హైదరాబాద్ లో గాని విశాఖపట్నం లోగానీ, హాస్పిటల్ లో చూపించండమ్మా అంటూ సెటైర్ వేశారు. లేదంటే రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతారని టిడిపి సీనియర్ నాయకుడు అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వంపై, వైయస్ జగన్మోహన్ రెడ్డి తీరుపై తీవ్ర విమర్శలు చేసిన అయ్యన్నపాత్రుడు జగన్ ను ఆసుపత్రిలో చూపించాలంటూ భారతికి రిక్వెస్ట్ చేశారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications