కొడాలికి అయ్యన్న ఘాటు కౌంటర్- 8 క్లాస్ ఫెయిల్ సన్నబియ్యం సన్నాసి 10 క్లాస్ జూమ్ కా ?

ఏపీలో వైసీపీ, టీడీపీ మధ్య జరుగుతున్న పొలిటికల్ వార్ కు తాజాగా విడుదలైన పదో తరగతి పరీక్షా ఫలితాలు మరింత ఆజ్యం పోశాయి. ఈ నేపథ్యంలో పదో తరగతిలో భారీగా విద్యార్ధులు ఫెయిల్ కావడంపై విపక్ష టీడీపీ విమర్శలు గుప్పిస్తోంది. ఇదే క్రమంలో ఇవాళ టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్.. పదో తరగతి ఫెయిలైన విద్యార్ధులతో జూమ్ మీటింగ్ చర్చ ఏర్పాటు చేయడం, ఇందులో వైసీపీ నేతలు వల్లభనేని వంశీ, కొడాలి నాని దర్శనమివ్వడంతో రాజకీయ మాటల యుద్ధం మరింత ముదిరింది.

నారా లోకేష్ పదో తరగతి ఫెయిలైన విద్యార్ధులతో ఏర్పాటు చేసిన జూమ్ మీటింగ్ లో కనిపించిన వైసీపీ మాజీ మంత్రి కొడాైలి నానికి టీడీపీ మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు ఆయన కొడాలిని టార్గెట్ చేస్తూ ఓ ట్వీట్ చేశారు. ఇందులో కొడాలినానిని తీవ్ర పదజాలంతో దూషించారు. గతంలో పౌరసరఫరాలశాఖ మంత్రిగా ఉన్నప్పుడు సన్నబియ్యం ఇచ్చే విషయంలో కొడాలి వైఫల్యాన్ని కూడా అయ్యన్న ఇందులో గుర్తుచేశారు.

ayyannapatrudu strong counter to kodali nani on appearing in lokesh zoom meeting

"8 క్లాస్ ఫెయిల్ అయిన సన్న బియ్యం సన్నాసి 10 క్లాస్ జూమ్ కి రావడం విడ్డూరం. గడప గడప కి వెళ్తుంటే ప్రజలు చెప్పుతో కొడుతున్నారు అందుకే ఆ కార్యక్రమం వదిలేసి జూమ్ కి వచ్చారు. విద్యా వ్యవస్థ ను నాశనం చేసిన జగన్ రెడ్డి రోడ్ల మీదకి వెళ్తే జనం పరిగెత్తించి కొడతారు అనే భయంతోనే పరదాలు కట్టుకొని వెళ్తున్నాడు". అంటూ అయ్యన్నపాత్రుడు ట్వీట్ చేశారు. దీంతో ఈ జూమ్ మీటింగ్ వ్యవహారం ఇరు పార్టీల మధ్య రాజకీయ మాటల యుద్ధాన్ని పతాకస్ధాయికి తీసుకెళ్లేలా కనిపిస్తోంది.

ayyannapatrudu strong counter to kodali nani on appearing in lokesh zoom meeting
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+