కదులుతున్న రైలు నుండి కిందపడిన యువతి: 6 గంటల నరకయాతన
ఏలూరు: కదులుతున్న రైలులో నుండి ఓ యువతి జారి బురదలో పడిపోయింది. సుమారు 6 గంటలకు పైగా బురదలోనే సహయం కోసం ఎదురు చూసింది. రైల్వే గ్యాంగ్‌మెన్ ఆమెను చూడడంతో ఆమె ప్రాణాలు దక్కించుకొంది. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లాలో ఆదివారం నాడు చోటు చేసుకొంది.
పశ్చిమగోదావరి జిల్లా భీమవరానికి చెందిన రాజేశ్వరి విజయవాడ నుండి పూరీ ఎక్స్‌ప్రెస్‌లో స్వంత ఊరికి బయలుదేరింది.

పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు- గుమ్ములూరు వద్ద ఆమె రైలు తలుపువద్ద నిలబడింది. ప్రమాదవశాత్తు రైలు నుండి కాలుజారి కిందపడిపోయింది. అయితే రాజేశ్వరి కిందపడిన ప్రాంతంలో బురద ఎక్కువగా ఉంది. దీంతో ఆమె ఆ బురదలోనే కూరుకుపోయింది.
ఉదయం 9 గంటల సమయంలో ఆ యువతి రైలు నుండి కిందపడిపోయింది. దీంతో బురదలో సుమారు 6 గంటలకు పైగా ఉంది. అయితే రైల్వే గ్యాంగ్ మెన్ పట్టాలను తనిఖీ చేస్తూ ఆ దారిగుండా ప్రయాణం చేస్తున్నాడు.
అయితే బురదలో కూరుకుపోయిన ఆ యువతిని అతను చూశారు. ఇతరుల సహయంతో ఆమెను బురద నుండి బయటకు తీశారు. బాధితురాలికి సపర్యలు చేశారు.అంబులెన్స్‌ను పిలిపించి ఆసుపత్రికి తరలించారు. .ఆసుపత్రిలో బాధితురాలు చికిత్స పొందుతోంది.
-
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!! -
అయ్యో.. విజయ్ ఎలక్షన్ ర్యాలీలో అపశ్రుతి.. -
అమరావతితో కూడిన ఏపీ కొత్త మ్యాప్ వచ్చేసింది.. తేడాలు సుస్పష్టం !!












Click it and Unblock the Notifications