• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అష్ట దిగ్బంధనం.. మరింత గడ్డు కాలం..! ప్రతికూల పరిస్థితులను బాబు ఎలా అదిగమిస్తారు...?

|

అమరావతి/హైదరాబాద్ : చంద్రబాబు అష్టదిగ్బంధానికి గురికాబోతున్నారా..? అక్రమ కట్టడాల కూల్చివేతలతో మొదలైన అసలైన రాజకీయం ఎక్కడితో ముగుస్తుంది. రాజకీయ వికృత క్రీడలో జరుగుతున్న పోటీలో చంద్రబాబు బలం ఎంత.. బలహీనత ఎంత.. అసలు బాబుకు మద్దత్తుగా నిలిచేది ఎవరు.. ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రతి అడుగు.. వివాదానికి కార‌ణ‌మ‌వుతోందా? ఒక ప‌క్క కేంద్రంలోని మోడీ స‌ర్కారు, మ‌రోప‌క్క రాష్ట్రంలోని జ‌గ‌న్ ప్రభుత్వం ముప్పేట దాడుల‌తో చంద్రబాబు ఉక్కిరి బిక్కిరి కావ‌డం ఖాయ‌మా అనే చ‌ర్చ సాగుతోంది.

ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న అంచ‌నాల ప్ర‌కారం .. రాబోయే రోజుల్లో చంద్ర‌బాబు కు ఇబ్బందిక‌ర ప‌రిస్థితులు త‌ప్పేలా క‌నిపించ‌డం లేదు. ఇప్ప‌టికే బీజేపీ ఆప‌రేష‌న్ లోట‌స్ పేరుతో ప్రారంభించిన ఆపరేష‌న్‌.. రాబోయే రోజుల్లో మ‌రింత‌గా పుంజుకునేందుకు సిద్ధ‌మైంది.బీజేపీ లోని కీల‌క నేత‌లు రాష్ట్రంలోని టీడీపీ నేత‌ల‌పై దృష్టి పెట్టారు. వారిని త‌మ పార్టీలోకి చేర్చుకోవ‌డం ద్వారా టీడీపీని బ‌ల‌హీన ప‌ర‌చాల‌ని నిర్ణ‌యించుకున్నారు.

 ముప్పేట దాడిలో చంద్రబాబు..! ఆదుకునే హస్తం ఏది..!!

ముప్పేట దాడిలో చంద్రబాబు..! ఆదుకునే హస్తం ఏది..!!

ఇప్ప‌టికే న‌లుగురు టీడీపీ రాజ్య‌స‌భ స‌భ్యులు.. అంత‌కు మించి చంద్ర‌బాబు కు అత్యంత స‌న్నిహితులు పార్టీ మారిపోయారు. ఇక‌, మ‌రో ప‌ది నుంచి 12 మంది వ‌ర‌కు ఎమ్మెల్యేల‌ను కూడా బీజేపీ లైన్‌లో పెడుతోంది. వీరిలో ప్ర‌ధానంగా వినిపి స్తున్న పేరు గంటా శ్రీనివాస‌రావు. ఆయ‌న వెళ్తే.. ఆయ‌న వెంట వెళ్లేందుకు మ‌రో న‌లుగురు కూడా ఉన్నార‌ని స‌మాచారం.ఇలా మొత్తంగా కేంద్రంలోని బీజేపీ.. బాబుపై తీవ్ర‌స్థాయిలో విజృంభించేందుకు రెడీ అయింది. దీని నుంచి నాయ‌కులను కాపాడుకోవ‌డం అనేది చంద్రబాబు నాయుడుకు ఇప్పుడున్న ప‌రిస్థితిలో విష‌మ ప‌రిస్థితే అని చెప్ప‌క‌త‌ప్ప‌దు. అదేస‌మ‌యంలో ఏపీలోని జ‌గ‌న్ ప్ర‌భుత్వం కూడా చంద్ర‌బాబును వీలైనంత వ‌ర‌కు భ్ర‌ష్టు ప‌ట్టించాల‌ని నిర్ణ‌యించుకుంది.

 చుట్టుముడుతున్న సమస్యలు..! సమీక్షలు జరిపితే సరిపోతుందా..!!

చుట్టుముడుతున్న సమస్యలు..! సమీక్షలు జరిపితే సరిపోతుందా..!!

ఈ క్ర‌మంలోనే చంద్రబాబు నాయుడు పాల‌న‌లో జ‌రిగిన అవినీతిని త‌వ్వి తీసేందుకు జ‌గ‌న్ వ్యూహాత్మ‌కంగా ముందుకు వెళ్తున్నారు. అంటే, రాబోయే రోజుల్లో చంద్ర‌బాబు పాల‌న ఎంత అవినీతి మ‌యంగా మారిందో.. టీడీపీ వాళ్లు ఎన్ని అక్ర‌మాలు చేశారో.. అంటూ.. రుజువులు సాక్షాల‌తో స‌హా.. జ‌గ‌న్‌.. ప్ర‌జ‌ల ముందు ఉంచ‌నున్నారు.ఇక‌, అదే స‌మ‌యంలో నైతికంగా బాబును దెబ్బ‌తీసేందుకు వాటిపై విచార‌ణ‌లు వేయ‌నున్నారు. ఇలా. మొత్తానికి చంద్రబాబు నాయుడు కు అటు కేంద్రంలోని బీజేపీ నుంచి రాష్ట్రంలోని జ‌గ‌న్ ప్ర‌భుత్వం నుంచి కూడా తీవ్ర యుద్ధ‌మే ఎదురు కానుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. దీనిని ఎదుర్కొనేందుకు చంద్ర‌బాబు ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్తారో.. లేదా.. ప‌శ్చిమ బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ మాదిరిగా.. ఇబ్బందుల్లో కూరుకుపోతారో చూడాలి.

 ముమ్మాటికి కక్ష్య సాధింపంటున్న తమ్ముళ్లు..! కర్తవ్యం ఏంటి..!!

ముమ్మాటికి కక్ష్య సాధింపంటున్న తమ్ముళ్లు..! కర్తవ్యం ఏంటి..!!

చంద్రబాబుపై కక్షసాధింపే ధ్యేయంగా సీఎం జగన్ పని చేస్తున్నారని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. చంద్రబాబు నివాసం ఉంటున్న లింగమనేని గెస్ట్ హౌస్ ను నిర్మించినప్పుడు రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారని చెప్పారు. ఒకవేళ అది అక్రమ కట్టడమైతే... వైయస్ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. అక్రమ కట్టడాలకు ఆనాటి వైయస్ ప్రభుత్వం ఎందుకు అనుమతులు ఇచ్చిందని అడిగారు. వైయస్ రాజశేఖరరెడ్డి పేరుతో ఉన్న పార్టీని జగన్ నడుపుతున్నారని... వైయస్ బొమ్మను పెట్టుకుని పాలన చేస్తున్నారని... ఈ నేపథ్యంలో, తన తండ్రి ఇచ్చిన అనుమతులకు జగనే బాధ్యత వహించాలని యనమల అన్నారు. తండ్రి అనుమతులిచ్చిన భవనాలకు కొడుకు నోటీసులు పంపడమేంటని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ భవన నిర్మాణానికి 2008లో గ్రామ పంచాయతీ, 2012లో రివర్ కన్జర్వేటర్ అనుమతి ఇచ్చారని తెలిపారు.

 కూల్చి వేత రాజకీయాలు..! సీఎం ఏకపక్ష నిర్ణాయలంటున్న టీడిపి..!!

కూల్చి వేత రాజకీయాలు..! సీఎం ఏకపక్ష నిర్ణాయలంటున్న టీడిపి..!!

కూలగొట్టడం, దాడులు చేయడం, భయోత్పాతం సృష్టించడమే జగన్ దినచర్య అని అన్నారు. భవనం నిర్మించే సమయానికి సిఆర్ డిఏ లేదు. అప్పటికి అమరావతి రాజధాని ప్రతిపాదన లేదు. చంద్రబాబుపై కక్షతోనే నదికి 130మీ దూరంలో ఉన్న ప్రజావేదికను కూలగొట్టారు. ఇప్పుడు చంద్రబాబు ఉంటున్న నివాసానికే ఏకంగా నోటీసులు అంటించారు. ఇది విధ్వంసక ప్రభుత్వంగా మారింది. భవనాలను నేలమట్టం చేస్తోంది,ఇళ్లకు నోటీసులిస్తోంది, పౌరులపై దాడులు చేయిస్తోంది. రాష్ట్ర అభివృద్దిపై సీఎం జగన్ కు దృష్టి లేదు, పేదల సంక్షేమంపై ఈ ప్రభుత్వానికి శ్రద్ద లేదు. బెదిరించడం,దాడులు చేయడం,దౌర్జన్యాలు జరిపించడం జగన్ నిత్యకృత్యాలు. చంద్రబాబు నిర్మాణానికి కృషి చేస్తే, జగన్మోహన్ రెడ్డి విధ్వంసం చేస్తున్నారు. ఈ దుందుడుకు చర్యలను ప్రజాస్వామ్య వాదులు ఖండించాలని ఆయన అన్నారు.

English summary
TDP leaders are furious that CM jagan is acting as a target for Chandrababu.Chandrababu is going to suffer in the coming days.who is going to rescue in babu's issue in the future, going big debate in amaravathi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X