హైదరాబాద్ మాదే, బాబు ఏదో ఒకటి చెప్పాలి: కోదండ

విడిపోయి ఎవరి బతుకులు వారు బతుకుదామని ఆయన సీమాంధ్రకు సూచించారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చేసిన ప్రకటన అస్పష్టంగా ఉందన్నారు. తెలంగాణకు అన్యాయం చేసేలా ఆయన మాట్లాడారని మండిపడ్డారు. చంద్రబాబు తెలంగాణకు అనుకూలమా కాదా స్పష్టంగా చెప్పాలన్నారు. ఆయన తన ప్రకటనలతో ఆయన గందరగోళపడి, ప్రజలను గందరగోళంలోకి నెట్టవద్దన్నారు.
హైదరాబాద్ వదిలి మీరే వెళ్లండి: అశోక్
మద్రాస్ నుంచి కర్నూలుకు వచ్చామని, కర్నూలు వదులుకొని హైదరాబాద్‌ని రాజధాని చేస్తే ఒప్పుకున్నామని, ఇప్పుడు హైదరాబాద్ నుంచి సీమాంద్రులు వెళ్లిపోవాలని తెరాస అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు బెదిరించే ధోరణిలో మాట్లాడుతున్నారని, ఇది ఎంతవరకు సబబు కాదని, అలాంటి పరిస్థితి వస్తే తెలంగాణవారే హైదరాబాద్‌ని వదిలి వెళ్లిపోండని చెప్పాల్సి వస్తుందని ఎపిఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు ఘాటుగా వ్యాఖ్యానించారు.
పార్లమెంటులో తెలంగాణ రాష్ట్ర విభజన బిల్లు పెడితే పదిలక్షల మందితో హైదరాబాద్‌లో మిలియన్ మార్చ్ జరిపి, తామేంటో నిరూపిస్తామని సవాల్ విసిరారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పాటయిన తరువాతే తెలంగాణకి విముక్తి లభించిందని, అప్పటిదాకా బానిసల్లా బతికారని వ్యాఖ్యానించారు. అనంతపురం జిల్లా హిందూపురంలో జరిగిన సేవ్ ఆంధ్ర ప్రదేశ్ సభలో ఆయన పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications