Badvel by poll Results: 23,754 ఓట్ల ఆధిక్యంలో వైఎస్‌ఆర్ సీపీ దాసరి సుధ - పూర్తయిన మూడో రౌండ్...!!
ముఖ్యమంత్రి సొంత జిల్లా బద్వేలు ఉప ఎన్నికలో మూడో రౌండ్ లెక్కింపు పూర్తయింది. మూడవ రైండ్ పూర్తయ్య సరికి వైసీపీ అభ్యర్ధి డాక్టర్ సుధ 23,754 ఓట్ల మెజార్టీతో ఉన్నారు. పోస్టల్ బ్యాలెట్ నుంచే వైసీపీ ఆధిక్యత కొనసాగుతోంది. తొలి రౌండ్‌లో వైఎస్సార్‌సీపీ 10,478, బీజేపీ 1688, కాంగ్రెస్‌కు 580 ఓట్లు లభించాయి. పట్టణంలోని గురుకుల ప్రభుత్వ బాలికల పాఠశాలలో ఇందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లుచేశారు. కోవిడ్ మార్గదర్శకాలకు అనుగుణంగా భారీ బందోబస్తు మధ్య ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఇందుకోసం నాలుగు కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటుచేశారు.
ఎన్నికల కమిషన్ జారీచేసిన కోవిడ్ మార్గదర్శకాలను అనుసరించి ఒక్కో కౌంటింగ్ కేంద్రంలో ఏడు టేబుళ్లను ఏర్పాటుచేశారు. ప్రతి కేంద్రంలో ఆర్వో, ఏఆర్వోలకు ఒక టేబుల్ ఏర్పాటుచేశారు. ఆర్వో ఉన్న కౌంటింగ్ కేంద్రంలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తున్నారు. ర్యాండమ్ చెకింగ్ కోసం ఒక వీవీ ప్యాట్ కేంద్రం ఏర్పాటుచేశారు. ప్రతి కౌంటింగ్ కేంద్రంలో ఒక సూపర్‌వైజర్, అసిస్టెంట్, మైక్రో అబ్జర్వర్ పర్యవేక్షిస్తున్నారు. గరిష్టంగా 12 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తవుతుందని అంచనా వేస్తున్నారు.

మధ్యాహ్నం 12గంటలకు తుది ఫలితం వెల్లడయ్యే అవకాశముంది. ఇప్పటివరకు సర్వీసు ఓటర్లు, 80 ఏళ్లు పైబడిన, దివ్యాంగుల ఓట్లు మొత్తం 235 పోస్టల్ బ్యాలెట్లు వచ్చాయి. ఓట్లు లెక్కించే సమయానికి సర్వీసు ఓటర్ల ఓట్లు అందితే వాటిని కూడా కలిపి లెక్కిస్తారు. నియోజకవర్గంలో మొత్తం 2,15,240 ఓట్లు ఉండగా, 1,47,213 ఓట్లు పోలయ్యాయి. మొత్తం 68.39 శాతం పోలింగ్ నమోదైంది. కాగా, వైసీపీ తొలి నుంచి భారీ మెజార్టీ పైనే గురి పెట్టింది. 2019 ఎన్నికల్లో సాధించిన 45 వేల మెజార్టీ కంటే ఎక్కువ సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం మూడో రౌండ్ ముగిసే సరికే దాదాపుగా 24 వేల మెజార్టీ సాధించింది. దీంతో..గతం కంటే ఎక్కువ మెజార్టీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications