TTD: తిరుమలలో కన్నుల పండుగగా భాగ్‌ సవారి - హుండీ కానుక‌లు రూ.26 కోట్లు..!!

Tirumala: తిరుమలలో బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించారు. సామాన్య భక్తులకు పెద్ద పీట వేస్తూ ⁠సౌక‌ర్య‌వంతంగా శ్రీవారి మూల‌మూర్తి, వాహ‌న సేవ‌ల‌ ద‌ర్శ‌నం కల్పించారు. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు పూర్తి అయిన మరుసటిరోజు "భాగ్‌సవారి" ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీ. ఈ ఉత్సవం ఆదివారం సాయంత్రం అత్యంత వైభవంగా జరిగింది.

భాగ్‌సవారి ఉత్సవం
శ్రీ వేంకటేశ్వరస్వామివారికి తిరుమలలో సంవత్సరంలో నిర్వహించే అనేకానేక ఉత్సవాలలో ఒకటైన భాగ్‌సవారి ఉత్సవం కన్నుల పండువగా నిర్వహించారు. పురాణ ప్రాశస్త్యం నేపథ్యంలో స్వామివారి భక్తాగ్రేసరుడైన శ్రీఅనంతాళ్వారుల భక్తిని పరీక్షించడానికి శ్రీదేవి సమేతంగా స్వామివారు అనంతాళ్వారు పూదోటకు మానవ రూపంలో విచ్చేస్తారు. తన పూదోటలో పూలు కోస్తున్న అమ్మవారిని అనంతాళ్వారువారు అశ్వత్త వృక్షానికి బంధిస్తాడు. అయితే స్వామివారిని పట్టుకోబోగా అప్రదక్షణ దిశలో పారిపోయి ఆలయంలో ప్రేవేశించి మాయమైపోతారు.

Bagh Savari festival observed at the Hill shrine of Tirumala

అత్యంత వైభవంగా
అనంతరం అనంతాళ్వారులు తన భక్తిని పరీక్షించడానికి విచ్చేసినది సాక్షాత్తు స్వామివారేనని విషయం గ్రహించి పశ్చాత్తాపపడుతాడు. వెంటనే అమ్మవారిని బంధీనుండి విముక్తురాలుని చేసి, పూల బుట్టలో కూర్చోబెట్టి స్వయంగా స్వామివారి చెంతకు చేరవేస్తాడు. తన భక్తునియొక్క భక్తికి మెచ్చి స్వామివారు అతని కోరిక మేరకు బ్రహ్మోత్సవాల మరునాడు తాను అనంతాళ్వారుల తోటలోనికి అప్రదక్షణంగా విచ్చేసి తిరిగి ఆలయంలోనికి ప్రవేశిస్తానని అభయమిచ్చాడు.ఈ నేపథ్యాన్ని పురస్కరించుకొని నిర్వహించే ఈ "భాగ్‌సవారి" ఉత్సవం ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది.

Bagh Savari festival observed at the Hill shrine of Tirumala

కానుక‌లు రూ.26 కోట్లు
స్వామివారు సాయంత్రం 4 గంటలకు వైభ‌వోత్స‌వ మండ‌పం నుండి బయలుదేరి అప్రదక్షిణంగా అనంతాళ్వారు తోటకు చేరి అక్కడ ప్రత్యేక పూజలందుకొని తిరిగి ఆలయంలోనికి ప్రవేశించడంతో ఈ కార్యక్రమం ఘనంగా ముగిసింది. అంత‌కుముందు శ్రీవారి ఆలయానికి నైరుతి దిశగా ఉన్న పురుశైవారి తోటలో అనంతాళ్వారు వంశీకులు భాగ్‌సవారి ఉత్స‌వం సంద‌ర్భంగా నాళాయరా దివ్య ప్రబంధం నిర్వ‌హించారు. బ్రహ్మోత్సవాల వేళ 6 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శనం చేసుకోగా..15 ల‌క్ష‌ల మంది భ‌క్తులు శ్రీ‌వారి వాహ‌న సేవ‌లు విక్షించారు. ⁠గరుడసేవనాడు 82,043 మంది దర్శించుకున్నారు. కాగా, గరుడసేవ‌లో దాదాపు 3.5 లక్షల మంది భక్తులు పాల్గొన్నారు.
కాగా..⁠హుండీ కానుక‌లు రూ.26 కోట్లు వచ్చినట్లు వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+