బాలకృష్ణ ఫ్యాన్స్ రాక్షసాభిమానం.. పొట్టేళ్ల తలలతో దండేసి.. విమర్శల వెల్లువ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ఫలితాల తర్వాత తెలుగుదేశం కూటమి విజయం సాధించడంతో రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు జరుగుతున్నాయి. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ హిందూపురం నియోజకవర్గంలో మరోమారు ఎమ్మెల్యేగా విజయం సాధించడంతో హిందూపురంలో మాస్ సెలబ్రేషన్స్ ఓ రేంజ్ లో జరుగుతున్నాయి. అయితే హిందూపురంలో జరిగిన మాస్ సెలబ్రేషన్స్ లో బాలయ్య అభిమానులు రాక్షసాభిమానం చూపించారు.
పొట్టేళ్ల తలకాయలతో బాలయ్య కటౌట్ కు దండ
బాలయ్య నిలువెత్తు కటౌట్ కు పొట్టేళ్ల తలకాయలతో దండ వేసి హంగామా చేశారు. పొట్టేళ్లను హతమార్చి వాటి తలల తోటి దండ గుచ్చి బాలకృష్ణ ఫోటోకు వేసి జై బాలయ్య అంటూ హంగామా చేశారు. బాలకృష్ణ పైన అభిమానం ఉండొచ్చు కానీ ఇదేమి హింసరా నాయనా అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో మండిపడుతున్నారు.

మూగ జీవాలను ఈ హింస ఏంటి? నెటిజన్లు ఫైర్
మీ అభిమానం కోసం మూగజీవుల తలకాయలను కాదు, మీ తలకాయలను తీసి ఆ దండ వేయండి అంటూ కొంతమంది భగ్గుమంటున్నారు. మూగజీవాలను బలి చేసి మన ఆనందం కోసం సంబరాలు చేయకండి ..ఇంత అభిమానం చూపే వాళ్ళల్లో ఒక్కరైనా కనీసం వేలు కోసుకుని రక్తంతో బాలయ్యకు అభిషేకం చేస్తారా.. చెయ్యరు. కానీ మూగజీవాల ప్రాణం మాత్రం ఇట్టే తీసేశారు అంటూ విమర్శిస్తున్నారు.
విమర్శిస్తున్న నెటిజన్లు
మీ ఆనందం కోసం నోరులేని అమాయకపు మూగ జీవాలను చంపటం పాపమని ఇలాంటి పనులు చేస్తే మీకు, మీ బాలకృష్ణకు భవిష్యత్తు ఉండదని రాక్షసులలాగా ప్రవర్తించడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కొందరు విమర్శిస్తున్నారు. ఇక మరికొందరైతే తెలుగుదేశం పార్టీ గెలిస్తే చంద్రబాబు అభివృద్ధి చేస్తారనేది ఎంత నిజమో టిడిపి శ్రేణులు ఇట్లాంటి తిక్క పనులు చేసి ఆయనకు చెడ్డ పేరు తీసుకు వస్తారనేది కూడా అంతే నిజం అంటూ పోస్టులు పెడుతున్నారు.
బాలయ్య చేసేదే కరెక్ట్.. మీ చెంపలు పగలగొట్టాల్సిందే
ఇదే తగ్గించుకుంటే మంచిది. అందుకే బాలయ్య ఎడాపెడా అభిమానుల చెంపలు పగలగొట్టేది అంటూ మరికొందరు విమర్శిస్తున్నారు. అభిమానం ఉండాలి కానీ ఆ అభిమానం జంతువులను గాని మనుషులను గాని బాధపెట్టే విధంగా ఉండకూడదని తమకు ఇష్టమైన ప్రియతమ నేతపై చూపించే అభిమానం ఇది కాదని చెబుతున్నారు. ఇది ఎక్కడ అరాచకంరా స్వామి అంటూ చూసిన ప్రతి ఒక్కరు ముక్కున వేలేసుకుంటున్నారు.












Click it and Unblock the Notifications