పార్టీని కాపాడుకోవటం కోసం- నాడు జరిగిందిదే : ఎన్టీఆర్ వెన్నుపోటు ఇష్యూ- బాలయ్య ఎమోషనల్..!!

ఉమ్మడి ఏపీ రాజకీయాల్లో 1955లో జరిగిన వెన్నుపోటు ఎపిసోడ్ ఎప్పిటికీ నిలిచిపోయే ఉంటుంది. టీడీపీ అధినేత చంద్రబాబు ను టార్గెట్ చేసే క్రమంలో ఇతర పార్టీల నేతలు ఇప్పటికీ సొంత మామ ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచారంటూ ఆరోపిస్తారు. తాజాగా, కొద్ది రోజుల క్రితం ఏపీ అసెంబ్లీలో జరిగిన పరిణామలు..ఆ తరువాత చంద్రబాబు కన్నీరు పెట్టం..నందమూరి కుటుంబం స్పందించిన సమయంలోనూ ఇలాంటి విమర్శలను వైసీపీ నేతలు చంద్రబాబు పైన ఎక్కు పెట్టారు.

1995 నుంచి ఆ ఎపిసోడ్ పైనే చర్చ

1995 నుంచి ఆ ఎపిసోడ్ పైనే చర్చ

ఇక, లక్ష్మీ పార్వతి లాంటి వారు నాడు చంద్రబాబు తన పదవి కోసం ఎన్టీఆర్ కుటుంబం సభ్యులను మభ్యపెట్టి తాను పార్టీని- సీఎం పదవిని దక్కించుకున్నారంటూ ఆరోపించారు. ఇక, ఇప్పుడు బాలయ్య ఆహా ఓటీటీలో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న టాక్‌ షో 'అన్‌స్టాపబుల్‌ విత్‌ ఎన్‌బీకే'. తాజా ఎపిసోడ్‌కు 'అఖండ' చిత్ర బృందం వచ్చి సందడి చేసింది. ఆ సమయంలో మరోసారి వెన్నుపోటు అంశాన్ని..మరోసారి ప్రస్తావించారు. ఒక సారిగా తండ్రిని..ఆ వెన్నుపోటు ఉదంతాన్ని గుర్తు చేసుకుంటూ కన్నీటి పర్యంతమయ్యారు. తండ్రితో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

బాలయ్య ఎమోషనల్

బాలయ్య ఎమోషనల్

నందమూరి తారక రామారావుకు తాను కేవలం కొడుకును మాత్రమే కాదని, అంతకుమించిన అభిమానినని చెప్పుకొచ్చారు. తండ్రి గురించి ప్రతీ మాట చెబుతున్న సమయంలో భావోద్వేగానికి లోనయ్యారు. తండ్రి గురించి మాట్లాడేసరికి నేను ఎంత పోగొట్టుకున్నానే విషయాన్ని చెప్పాలనుకున్నానంటూ కీలక వ్యాఖ్యలు చేసారు. పుట్టినప్పటి నుంచి ఆయనకు దూరంగా పెరిగానన్నారు. ఆయన మద్రాసులో ఉంటే నేను హైదరాబాద్‌లో ఉండేవాడినని చెప్పారు. ఆయన రాజకీయాల్లో వచ్చిన తర్వాత తాను సినిమాల కోసం మద్రాసులో ఉండాల్సి వచ్చిందని... చివరి వరకూ ఎవరి మీదా ఆధారపడకుండా బతికిన వ్యక్తి ఆయన అంటూ తన తండ్రి గురించి వివరించారు.

ఎన్టీఆర్ ఒప్పుకొనే వారు కాదు

ఎన్టీఆర్ ఒప్పుకొనే వారు కాదు


తన తండ్రికి ఏమైనా ఇద్దామంటే ఒప్పుకొనే వారు కాదని చెప్పారు. ఒక సందర్బంలో తన తండ్రికి 800సీసీ మారుతీకారు ఉండేదని..అందులోనే అందరూ ఇరుక్కుని వెళ్లేవారని గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో తాను 1000సీసీ కారు వాడేవాడినని.. దీంతో, ఎన్టీఆర్ వద్దకు వెళ్లి కారు తీసుకోమని కోరగా... మీరు మాకు ఇచ్చేదేంటి... ఇలాంటివి వందలు కొనగలం అంటూ అన్నారని చెప్పుకొచ్చారు. కొడుకు ఇచ్చే స్థాయికి వచ్చాడనే ఆనందం ఆయనదని బాలయ్య వివరించారు. ఆ తర్వాత చాలా మంది తప్పుడు ఆరోపణలు చేశారు. ఇక, ఎపిసోడ్ వ్యవహారం గురించి వివరించే ప్రయత్నం చేసారు.

పార్టీని కాపాడుకోవటం కోసమే అంటూ

పార్టీని కాపాడుకోవటం కోసమే అంటూ

ఎన్టీఆర్‌ను పిల్లలు సరిగా చూసుకోలేదంటూ.. వెన్నుపోటు పొడిచారుంటూ విమర్శలు చేశారని చెప్పుకొచ్చారు. ఒకరు ఏదైనా విషయం పదిసార్లు చెబితే అదే నిజమనుకుంటారని బాలయ్య వ్యాఖ్యానించారు. పార్టీని కాపాడుకోవటం కోసం..అంటూ మరింత వివరంగా చెప్పబోయిన బాలయ్య..అంతోనే.. సరే అది పక్కన పెట్టండి అంటూ..తాను ఇక్కడ రాజకీయాలు మాట్లాడకూడదంటూ ఆ చర్చ ముగించేసారు. తాను ఆయనకు కొడుకుని మాత్రమే కాదు.. అభిమానిని కూడా అని మరోసారి చెప్పారు . కుటుంబం, రాష్ట్రం, రాజకీయం వేరని చెప్పుకొచ్చారు. అన్నీ కలిపి కలగాపులగం చేసేశారంటూ బాలయ్య ఎమోషనల్ అయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+