ఢిల్లీకి మామా అల్లుళ్లు బాలయ్య, లోకేష్: అశోక్‌కు పౌర
హైదరాబాద్/న్యూఢిల్లీ: నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారానికి హీరో, హిందూపురం టిడిపి శాసన సభ్యుడు నందమూరి బాలకృష్ణ, టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ హాజరు కానున్నారు. మోడీ సోమవారం సాయంత్రం ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీనికి హాజరయ్యేందుకు బాలకృష్ణ, నారా లోకేష్‌లు హైదరాబాదు నుండి మధ్యాహ్నం బయలుదేరి ఢిల్లీ చేరుకున్నారు. రామోజీ రావు కూడా హాజరవుతున్నారు.
మోడీ ప్రమాణ స్వీకారానికి మనం రాష్ట్రం నుండి టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, బిజెపి తెలంగాణ, సీమాంధ్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి, కంభంపాటి హరిబాబు, బిజెపి ఎంపీలు, ఇతర ముఖ్య నేతలు, తెరాస అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు తదితరులు హాజరవుతున్నారు. మరోవైపు మోడీ కేబినెట్లో అశోక గజపతి రాజుకు పోర్ట్ లేదా పౌరయాన శాఖ దక్కే అవకాశాలున్నాయి.

కాగా, మోడీ భారతదేశ 15వ ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దాదాపు మూడు దశాబ్దాల తరువాత ప్రాతినిధ్య ప్రజాస్వామ్య వ్యవస్థ తొలిసారి సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు దిశగా అడుగులు వేయనుంది. మరికొన్ని గంటల్లోనే ఆవిష్కృతమయ్యే ఈ అరుదైన, అపురూప దృశ్యానికి బ్రహ్మాండమైన రీతిలో రాష్ట్రపతి భవన్ వెలుపల జరుగుతున్న ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి.
తనని ఢిల్లీ పీఠం వరకు భుజాలపై మోసుకొచ్చిన జనం ఎదుట మోడీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ ప్రధాన ఆకర్షణ కానున్న ఈ వేడుకలో సార్క్ దేశాల అధిపతులు సహా మూడువేల మంది దేశ, విదేశీ ప్రతినిధులు, అతిథులు ప్రత్యక్షంగా పాల్గొననున్నారు.












Click it and Unblock the Notifications