అనంతపురంలో మామా-అల్లుడు బాలకృష్ణ, లోకేష్ హల్‌చల్
అనంతపురం: మామా అల్లుళ్లు నందమూరి బాలకృష్ణ, నారా లోకేష్‌లు అనంతపురంలో సందడి చేశారు. జిల్లా పార్టీ ఎమ్మెల్యే బీకే పార్థసారథి వివాహానికి వీరిద్దరు హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు. వీరితో పాటు మంత్రులు కొల్లు రవీంద్ర, పత్తిపాటి, కామినేని శ్రీనివాస రావు తదితరులు హాజరయ్యారు.
కాగా, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నారా లోకేష్ ఉన్నారు. నందమూరి బాలకృష్ణ గత సార్వత్రిక ఎన్నికల్లో అనంతపురం జిల్లాలోని హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. గురువారం అనంతపురంలోని ఓ ఫంక్షన్ హాలులో జరిగిన వేడుకకు హాజరయ్యారు.

ఈ వివాహ మహోత్సవానికి హాజరయ్యేందుకు బాలకృష్ణ బుధవారం రాత్రే అనంత వచ్చారు. లోకేష్ మాత్రం గురువారం ఉదయం వచ్చారు. జిల్లా మంత్రులు పరిటాల సునీత, పల్లె రఘునాథ్ రెడ్డి తదితరులు కూడా హాజరయ్యారు.












Click it and Unblock the Notifications