లాభాలు వద్దు: బాలకృష్ణ, బెజవాడ వెళ్లిపో: బాబుపై కవిత నిప్పులు
హైదరాబాద్: ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా హైదరాబాదు బసవతాకరకం క్యాన్సర్ ఆసుపత్రిలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా హిందూపురం శాసన సభ్యుడు, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ మాట్లాడారు. ఆసుపత్రి నిర్వహణలో లాభాలు ఆశించడం లేదన్నారు.
లాభాలు ఆశించకుండా ఆసుపత్రిని నిర్వహిస్తున్నామన్నారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని చెప్పారు. క్యాన్సర్ వ్యాధి గురించి భయపడవలసిన పని లేదన్నారు. అది నయం అవుతుందన్నారు. ఆసుపత్రిలో ఆధునిక సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు.
ఏపీ శాసన సభాపతి కోడల శివప్రసాద్ మాట్లాడుతూ.. తొలి దశలో గుర్తిస్తే క్యాన్సర్‌ను తగ్గించుకోవచ్చునని చెప్పారు. సెల్ ఫోన్ల వల్ల కూడా క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని తెలిపారు. పొగాకు, దాని ఉత్పత్తుల కారణంగా క్యాన్సర్ పీడితుల సంఖ్య పెరుగుతోందన్నారు.
తెరాస తొలి సభ్యత్వం తీసుకున్న కవిత

తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమైంది. నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత తొలి సభ్యత్వం తీసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన మండిపడ్డారు.
హైదరాబాదును విదేశాలతో పోల్చి చంద్రబాబు తెలంగాణ ప్రజలను అవమానించారని ధ్వజమెత్తారు. 2019లో రెండు రాష్ట్రాల్లో తాము అధికారంలోకి వస్తామని చంద్రబాబు ఎలా చెబుతారని ప్రశ్నించారు.
తాను హైదరాబాదును అభివృద్ధి చేశానని, హైటెక్ సిటీని నేనే కట్టానని చంద్రబాబు చెబుతుంటాడని, ఇప్పుడు అదే హైదరాబాదును విదేశాలతో పోల్చడం దారుణమన్నారు. ఇష్టం లేకుంటే విజయవాడకు వెళ్లిపోవచ్చునని చెప్పారు. చంద్రబాబు తక్షణమే తాను చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకొని, క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి రాజధాని ప్రజలకు అందుబాటులో ఉండదని తాము మొదటి నుండి చెబుతున్నామని గుర్తు చేశారు.
కాగా, హైదరాబాద్‌లో ఉండి ఆంధ్రప్రదేశ్‌ను పరిపాలించడం విదేశాల్లో ఉండి పాలన సాగిస్తున్నట్లు ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెళ్లిపోవాలని, ఈ విషయంలో ప్రభుత్వం పట్టుదలగా ఉందని ఉద్యోగ సంఘాల నేతలకు స్ప ష్టం చేశారు.
హైదరాబాద్‌లో కూర్చుని పరిపాలన సాగించడం తనకు ఏ మాత్రం బాగా లేదని, ఇక్కడ ఉండి పాలన సాగిస్తే ప్రజలు ఇబ్బందులు పడతారని, అది సరికాదని, మనం వెళ్లిపోవాలని, అది తప్పదని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి పాలన సాగించడానికి మీరంతా నాకు సహకరించాలని ముఖ్యమంత్రి ఉద్యోగ సంఘాల నాయకులకు విజ్ఞప్తి చేశారు.
ఆంధ్రప్రదేశ్ నుంచే పాలన సాగించే విషయమై ప్రభుత్వం చాలా పట్టుదలగా ఉందని, ఉద్యోగులు కూడా ఇందుకు సహకరించాలని స్పష్టం చేశారు. ఏపీ ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు అశోక్‌బాబు, వెంకటేశ్వరరావు, బొప్పరాజు వెంకటేశ్వర్లు, కత్తి నరసింహారెడ్డి తదితరులు మంగళవారం రాత్రి సచివాలయంలో సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. పీఆర్సీతోపాటు ఉద్యోగులకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు.












Click it and Unblock the Notifications