• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఎన్టీఆర్ వెన్నుపోటుపై బాలకృష్ణ సెన్సేషన్: ఎమోషనల్ అయిన బాలకృష్ణ ఏం చెప్పారు?

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఎన్టీఆర్ కు చంద్రబాబు వెన్నుపోటు పొడిచిన విషయాన్ని పదే పదే ప్రస్తావించడం టీడీపీ ప్రత్యర్థి పార్టీలకు సహజమైన విషయం. గత ఎన్నికల తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ ఘోర పరాజయం పాలై ప్రతిపక్ష పార్టీగా అధికార పార్టీ పై ప్రస్తుతం సమరం చేస్తుంది. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి వైసీపీ టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం నిత్యం కొనసాగుతుంది. చంద్రబాబును గట్టిగా టార్గెట్ చేయాలని భావించిన ప్రతిసారి మామకు వెన్నుపోటు పొడిచారు అంటూ వైసీపీ నేతలు టార్గెట్ చేయడం అలవాటుగా మారిపోయింది.

జగన్ ప్రభుత్వానికి అమరావతి రైతుల అల్టిమేటం.. తిరుపతి బహిరంగసభకు అనుమతివ్వకుంటే చేసేదిదే!!జగన్ ప్రభుత్వానికి అమరావతి రైతుల అల్టిమేటం.. తిరుపతి బహిరంగసభకు అనుమతివ్వకుంటే చేసేదిదే!!

వెన్నుపోటుపై బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు

వెన్నుపోటుపై బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు


ఇక ఈ సమయంలో ఎన్టీఆర్ తనయుడు బాలకృష్ణ వెన్నుపోటు పై సంచలన వ్యాఖ్యలు చేయడం, భావోద్వేగానికి గురి కావడం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాలలో ఆసక్తికరంగా మారింది. తాను వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ అనే కార్యక్రమంలో నందమూరి తారక రామారావుని గుర్తు చేసుకున్న బాలకృష్ణ భావోద్వేగానికి గురైన పరిస్థితి చోటు చేసుకుంది. ఇటీవల బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన అఖండ సినిమా మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ కార్యక్రమానికి దర్శకుడు బోయపాటి శ్రీను, నటుడు శ్రీకాంత్, ప్రజ్ఞా జైస్వాల్ తదితరులు వచ్చారు. ఇక ఈ ప్రోగ్రాం కి సంబంధించి ప్రోమోలో బాలకృష్ణ ఎన్టీఆర్ ను ముఖ్యమంత్రిగా గద్దె దించే అంశాన్ని ప్రస్తావించడం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.

ఎన్టీఆర్ కుమారుడినే కాదు ఆయన అభిమానిని .. ఎమోషనల్ అయిన బాలయ్య

ఈ ప్రోమోలో బాలకృష్ణ వెన్నుపోటు విషయంలో దుష్ప్రచారం జరుగుతోందని, కావాలని తప్పుడు ప్రచారం చేశారని వివరణ ఇచ్చారు. అంతేకాదు ఎన్టీఆర్ కు తాను కేవలం కుమారుడిని మాత్రమే కాదని ఆయన అభిమానుల్లో ఒకడినని బాలకృష్ణ చెప్పుకొచ్చారు. బాలయ్య బాగా ఎమోషనల్ అయిన ఈ ఎపిసోడ్ ప్రోమో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ ఎపిసోడ్ డిసెంబర్ 10వ తేదీన ప్రసారం కానుండడంతో బాలకృష్ణ ఎన్టీఆర్ వెన్నుపోటుపై 25 ఏళ్ల తర్వాత ఏం చెప్పారు అన్నది ఆసక్తికరంగా మారింది. ఇదే సమయంలో బాలకృష్ణ టాక్ షోలో ఎన్టీఆర్ పైన, నాటి రాజకీయాలపైనా ప్రశ్నించే స్థాయి ఉన్న వాళ్ళు ఎవరూ లేరని, అలాంటి సమయంలో బాలకృష్ణ ఎందుకు ఎన్టీఆర్ వెన్నుపోటు అంశాన్ని ప్రస్తావించారు అనేది ఆసక్తికర చర్చకు కారణం గా మారింది.

నాటి ఘటనపై బాలకృష్ణ స్పందన పై రాజకీయ వర్గాల్లో ఆసక్తి

నాటి ఘటనపై బాలకృష్ణ స్పందన పై రాజకీయ వర్గాల్లో ఆసక్తి

అసలు నాటి ఘటనపై బాలకృష్ణ ఏమని వివరణ ఇస్తారు? ఇటీవల కాలంలో బాలకృష్ణను కూడా ఎన్టీఆర్ వెన్నుపోటుపై టార్గెట్ చేసిన నేపథ్యంలో బాలకృష్ణ స్పందన ఏమిటి? అన్నది ఉత్కంఠ రేపుతోంది . నాడు ఎన్టీఆర్ ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించే సమయంలో ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు అందరూ చంద్రబాబు వైపు ఉన్న పరిస్థితి ఎందుకొచ్చింది? అనేది బాలకృష్ణ చెప్తారా అన్న చర్చ సాగుతోంది. అప్పట్లో బాలకృష్ణ రాజకీయాల్లో లేరు, కానీ ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో హిందూపురం ఎమ్మెల్యేగా రాజకీయాల్లో కొనసాగుతున్నారు.

బాలకృష్ణ వెన్నుపోటుపై ఇంత కాలానికి స్పందన .. ముందుముందు ఏం జరుగుతుందో

బాలకృష్ణ వెన్నుపోటుపై ఇంత కాలానికి స్పందన .. ముందుముందు ఏం జరుగుతుందో

ఇక టీడీపీ అధినేత చంద్రబాబు బాలకృష్ణకు స్వయానా వియ్యంకుడు కావడంతో పాటు, ఇటీవల గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న చంద్రబాబుకు బాసటగా బాలకృష్ణ నాటి ఘటనపై ఏమైనా చెప్పదలుచుకున్నారా? అన్న చర్చ సైతం సాగుతుంది. ఏది ఏమైనా చంద్రబాబు అంటేనే వెన్నుపోటుకు పేటెంట్ తీసుకున్న వ్యక్తి అంటూ ఎన్టీఆర్ వెన్నుపోటు పై చంద్రబాబుని టార్గెట్ చేస్తున్న సమయంలో, బాలకృష్ణ ఈ వ్యవహారంపై స్పందించడం ముందు ముందు ఎలాంటి చర్చ కారణమవుతుందో వేచి చూడాల్సిందే. బాలయ్య షో ప్రసారం అయితే తప్పా అసలు బాలయ్య ఎన్టీఆర్ వెన్నుపోటు పై ఎందుకు మాట్లాడారో అర్ధం కాదు.

English summary
Balakrishna made sensational remarks on NTR backstabbing. Balakrishna, who recalled NTR on a show called Unstoppable, Balakrishna gets emotional, said there was a lot of propaganda about backstabbing on NTR.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X